Betting App Promotion Case:గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్స్ కేస్ ఎంత సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొదలుకొని పాన్ ఇండియా స్టార్స్ వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి తమ వరకు లాభం పొందుతున్నారు. కానీ ఈ యాప్స్ వల్ల ఎదుటి వ్యక్తులు ఎంత నష్టపోతున్నారు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి గెలవడం అసాధ్యమని తెలిసి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక అలా ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారందరినీ వెలుగులోకి తీసుకురాగా..అందులో భాగంగానే పలువురి సినీ సెలబ్రిటీలపై కూడా కేసు నమోదు అయింది.
భయ్యా సన్నీ యాదవ్ కు లుక్ అవుట్ నోటీసులు..
ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా పేరు సొంతం చేసుకున్న యూట్యూబర్ నానిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా.. ఇప్పుడు హర్ష సాయి (Harsha Sai) పై కూడా కేసు ఫైల్ అయింది. ఇక అతడిని అరెస్టు చేయాల్సి ఉండగా ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దీనికి తోడు మరో యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు ఫైల్ అయింది. అత్యధిక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన జాబితాలో ఇతని పేరు కూడా ఉండడంతో ఇతడిని కూడా పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..బెట్టింగ్ యాప్ ప్రమోటర్ భయ్యా సన్నీ యాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 5న సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేయగా.. భయ్యా సన్నీ యాదవ్
పరారీ లో వున్నారు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఏ క్షణమైనా భయ్యా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
విదేశాల్లో ఉన్నట్లు గుర్తింపు..
ఇకపోతే తాజాగా సూర్యాపేట డీఎస్పీ రవి భయ్యా సన్నీ యాదవ్ అరెస్టుపై మాట్లాడుతూ.. “భయ్యా సన్నీ యాదవ్ పై బెట్టింగ్ ఆపు ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 5వ తేదీన కేసు ఫైల్ అవ్వడం జరిగింది. నూతనకళ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నారు. ఇంకా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. విదేశాలలో ఉన్నట్లు మా బృందం గుర్తించింది. భయ్యా సన్నీ యాదవ్ భారత దేశంలోకి అడుగుపెట్టిన ఏ క్షణమైనా సరే అతడిని అరెస్టు చేసేలా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము” అంటూ తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై వివరణ ఇచ్చిన సెలెబ్రెటీలు..
ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో రానా (Rana ), హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తో పాటు బుల్లితెర సెలబ్రిటీస్ విష్ణు ప్రియ (Vishnu Priya), రీతూ చౌదరి (Rithu Chaudhary), యాంకర్ శ్యామల (Anchor Shyamala) తదితరులపై కూడా కేసు నమోదయింది. అయితే వీరందరూ కూడా ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. ఇప్పటికే రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ల పిఆర్ టీమ్స్ స్పందించగా.. యాంకర్ శ్యామల మాత్రం హైకోర్టును ఆశ్రయించి ఆశ్రయించింది. ఆమెను అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక అటు విష్ణుప్రియ, రీతు చౌదరి తో పాటు పలువురు పోలీసుల విచారణలో పాల్గొని అసలు విషయాన్ని వెల్లడించారు. ఇక అంతేకాదు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని, ఇలాంటి వాటిని ఎవరు నమ్మకండి అంటూ వీడియోలు వదిలిన విషయం తెలిసిందే.
భయ్యా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది: సూర్యాపేట డీఎస్పీ రవి
దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే అతడిని అరెస్టు చేస్తామన్న డీఎస్పీ https://t.co/AJrvcGJSGn pic.twitter.com/894mZZR0CW
— BIG TV Breaking News (@bigtvtelugu) March 22, 2025
Mohan Lal: షాకింగ్ ఫ్యాక్ట్… లూసిఫర్ 2 కోసం మోహన్ లాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?