కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్:
Virat Kohli: భారత క్రికెట్ స్టార్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ { Virat Kohli}వంటి మోడ్రన్ గ్రేట్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ కోహ్లీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే క్రికెటర్ కి ఉండదనేది తెలిసిన విషయమే. జట్టులో స్థానం సంపాదించుకుంటున్న అనేకమంది క్రికెటర్లు.. విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకొని వస్తున్నారు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి టాక్ ఆఫ్ ది టౌన్ గానే నిలుస్తున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అరుదైన రికార్డులను అవలీలగా బద్దలు కొట్టిన కోహ్లీ.. గత మూడేళ్లపాటు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు.
దీంతో ఈ రన్ మిషన్ పని అయిపోయిందని విమర్శలు గుప్పించారు. కోహ్లీ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో ఫామ్ లోకి తిరిగి వచ్చి.. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక విరాట్ కోహ్లీ ఎక్కడ కనిపించినా ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ ఎగబడతారు. అయినా ఎప్పుడూ చికాకు పడకుండా తన అభిమానులను సంతోష పెట్టడం కోహ్లీకి అలవాటు. ఇలా విరాట్ కోహ్లీ తన అభిమానులను సంతోషపెట్టిన ఘటనలు కోకొల్లలు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
కోహ్లీ భయ్యా ఆటోగ్రాఫ్:
విరాట్ కి వయసుతో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. అతడు ప్రాక్టీస్ స్టేషన్ లో పాల్గొన్నా, మ్యాచ్ లు ఆడినా ఇలా ఎక్కడైనా అభిమానులు అతడి కోసం పోటెత్తుతారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} జట్టు ప్రాక్టీస్ స్టేషన్ లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్ కి ఓ లిటిల్ ఫ్యాన్ వచ్చాడు. ఆ పిల్లాడు “కోహ్లీ భయ్యా ఆటోగ్రాఫ్” అని అరుస్తూ విరాట్ కోహ్లీని అనుసరించాడు. కాగా కొన్ని గంటల నిరీక్షణ అనంతరం ఆ పిల్లాడిని విరాట్ కోహ్లీ గుర్తించాడు. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో బస్సులో కూర్చున్న విరాట్.. ఆ లిటిల్ ఫ్యాన్ కి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
ఆ పిల్లాడు చేతిలో పట్టుకున్న ఫోటోపై ఆటోగ్రాఫ్ ఇచ్చి.. ఆ లిటిల్ ఫ్యాన్ కి కోహ్లీ లైఫ్ టైం మెమోరీని అందించాడు. దీంతో ఈ పిల్లాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కోహ్లీ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈసారి ఆర్సిబి జట్టుకి రజత్ ప్రతిదార్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆర్సిబి జట్టు చాలావరకు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది. అయితే ఈ సీజన్ లో ఆర్సిబి ఏ మేరకు రాణిస్తుందనేది వేచి చూడాలి.