Betting Apps Case :రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చాలామంది సెలబ్రిటీలు చెలగాటం ఆడారు అనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సొంత లాభం పొందడానికి ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. అయితే సెలబ్రిటీలు చెప్పడంతో తమకు కూడా లాభం కలుగుతుందని నమ్మిన ఎంతోమంది, ఆ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి , అప్పులు చేసి వాటిని తీర్చలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ లను ఎవరైతే ప్రమోట్ చేశారో వారందరిపై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వారి బ్యాక్ గ్రౌండ్ ను పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపై కూడా కేసు ఫైల్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వ పోలీసులపై పలువురు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి..
ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ప్రధాన సూత్రధారులుగా ఉన్న హర్ష సాయి (Harsha Sai) , ఇమ్రాన్ ఖాన్ లపై మియాపూర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. గత నెలలోనే హర్షసాయిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉండగా.. ఆయన పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఏ క్షణమైనా సరే అరెస్టు చేస్తామని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు తనకోసం పోలీసులు గాలింపు చేపట్టిన నేపథ్యంలో సడన్గా మియాపూర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో తనపై ఫైల్ అయిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయినా విచారణ ఎదుర్కోవాల్సిందే..
అయితే ఎంత పిటిషన్ వేసినా విచారణ ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కాబట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హర్ష సాయి వెళ్లాల్సిందే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల ప్రముఖ సినీ నటి విష్ణుప్రియ(Vishnu Priya) కూడా తనపై కేస్ ఫైల్ అవ్వగా.. ఈమె పిటిషన్ ను హైకోర్టు రద్దు చేసింది. అంతేకాదు ఆమె విచారణకు ప్రస్తుతం సహకరిస్తున్నట్లు తెలిసిన విషయమే. అందుకే హర్ష సాయి కూడా హైకోర్టులో పిటీషన్ వేసినా కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే అని అటు నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్..
ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి.. దాదాపు 25 మందికి పైగా సెలబ్రిటీలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.ఇప్పటికే యాంకర్ శ్యామల , విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణను ఎదుర్కొంటూ ఉండగా.. మరి కొంతమంది ఈ విషయంపై స్పందించారు కూడా.. ఇంకొంతమంది పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలోనే అన్ని విషయాలు తేలుస్తామని పోలీసులు తెలియజేశారు..