Jabardast Pavitra:జబర్దస్త్ (Jabardast) కార్యక్రమం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర (Pavitra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చూడడానికి పొట్టి పిల్ల అయినా తన మాటలతో, కామెడీతో దిట్ట అని ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో స్కిట్లు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తన కామెడీతో అందరినీ నవ్విస్తుంది. కానీ తన జీవితంలో మిగిలిన విషాద గాధలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇక టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఈమె జబర్దస్త్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇకపోతే తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న ఈమె తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
Tollywood: మళ్లీ తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..!
నా తండ్రితో 13 ఏళ్లు మాట్లాడలేదు – పవిత్ర
అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు ‘ఫ్యామిలీ స్టార్’ అనే టీవీ షోలో కూడా రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఒక ఎపిసోడ్లో మీ లైఫ్ లో మీరు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారా ? అని పవిత్రను అడగగా.. ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ తన తండ్రిని తలుచుకుంది.. “నేను నా జీవితంలో ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే, అది మా నాన్నకు మాత్రమే. 13 ఏళ్లు నేను ఆయనతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయనతో గడపాలని ఉన్నా ఆయన భూమి మీద లేరు. ఆయన చనిపోయాక వెళ్లి కాళ్లు పట్టుకున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ ఎలా ఉన్నా కూడా వాళ్లతో ఖచ్చితంగా మాట్లాడాలి. వాళ్ళని మనం జడ్జ్ చేసి, పనిష్ చేసే రైట్స్ మనకు లేవు. నేను మా నాన్న విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి మీరు ఎవరు ఇలాంటివి చేయకండి. తల్లిదండ్రులు ఏమన్నా సరే పడాల్సిందే.వాళ్లు మనల్ని కనీ పెంచి, పోషించి, ఈ స్టేజ్ కు తీసుకువచ్చారు అంటే.. వారికి మనల్ని తిట్టే హక్కు కూడా ఉంటుంది. దయచేసి మీరు ఎవరూ కూడా నాలాగా చేయకండి “అంటూ షోలో ఎమోషనల్ అయిపోతూ అందరి చేత కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
తన తండ్రిపై పవిత్ర ఎమోషనల్ కామెంట్స్..
గతంలో ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ.. “మా నాన్న కష్టపడితేనే మాకు డబ్బులు వస్తాయి. మా కడుపు నిండుతుంది. మా నాన్న ఒక లారీ డ్రైవర్. కానీ మా నాన్న తాగుడుకు బానిస అయ్యి, మమ్మల్ని పట్టించుకోలేదు. భార్య పిల్లల్ని గాలికి వదిలేసి.. మాకు కడుపు నింపకుండా మా నాన్న తాగుడు కోసం మాత్రమే పని చేసేవారు. అందుకే నేను ఆయనతో మాట్లాడటం మానేశాను. మా కష్టాన్ని ఏ రోజు కూడా ఆయన తీర్చలేదు. అయినా సరే ఆయన మాకు తండ్రి కాబట్టి మేము అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ తండ్రి గురించి చెప్పి ఎమోషనల్ అయింది పవిత్ర.
?utm_source=ig_web_copy_link