
Bhagavanth Kesari: వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బాలయ్య దసరా పండుగకి ‘భగవంత్ కేసరి’మూవీ తో బరిలోకి దిగాడు. ఒక పక్క విజయ్ లియో, మరోపక్క రవితేజ టైగర్ నాగేశ్వరరావు తో తలపడుతూ రంగంలోకి దిగిన బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన వారం రోజులకే మంచి కలెక్షన్స్ తో దూసుకు వెళ్లి దసరా విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం. ఇక ఈ మూవీలో బాలయ్య నటన ఆస్కార్ కూడా తక్కువే అంటున్నారు నందమూరి అభిమానులు.
ఈ చిత్రంలో అనవసరమైన ఒక్క పాట ,ఒక్క డైలాగ్ పెట్టకుండా ఎంతో పర్ఫెక్ట్ గా సినిమాని డైరెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి. అయితే ఈ చిత్రానికి గాను 1984 లో బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు చిత్రంలోని దంచవే మేనత్త కూతురా సాంగ్ ని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్టార్టింగ్ లో ఈ సాంగ్ చిత్రంలో యాడ్ చేయడం వల్ల మూవీకి ఉన్న ఇంటెన్సిటీ దెబ్బతింటుంది. అందుకే డైరెక్టర్ ..లాస్ట్ మినిట్ లో సాంగ్ యాడ్ చేయకుండానే సినిమా రిలీజ్ చేశారు.
ఇక రీసెంట్ గా ఈ చిత్రంలో ‘దంచవే మేనత్తా కూతురా’ రీమిక్స్ సాంగ్ యాడ్ చేయడం జరిగింది. ఈ పాటకి ఊహించిన దాని కంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కమర్షియల్ మాస్ పాటకు మొదటినుంచి క్రేజ్ ఉంది. అయితే కేవలం సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత మూవీలోని కంటెంట్ కి పాట అడ్డం వస్తుందేమో అన్న అనుమానంతో సాంగ్ తొలగించారు. ఈ విషయాన్ని ప్రేక్షకులకు విడుదలకు ముందే కన్వే చేయడం జరిగింది.
అయితే పండుగ రోజు నుంచి ఈ పాటను సినిమాలో యాడ్ చేశారు. ఆల్రెడీ చూసిన సినిమా అయినప్పటికీ మళ్లీ ఈ పాట కోసం చాలా మంది తిరిగి సినిమాని చూడడానికి ఉత్సాహం కనబరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కి సంబంధించిన స్టిల్ ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతుంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ తనదైన స్టైల్ లో ఆలపించాడు. ఇక ఈ పాటకి బాలయ్య అటు కాజోల్ ఇటు శ్రీలీల తో కలిసి వేసిన చిందులు వేరే లెవల్ లో ఉన్నాయి. ఈ పాటకి అభిమానులు థియేటర్లలో విజిల్స్ వేస్తూ గోల గోల చేసి రచ్చ పుట్టిస్తున్నారు.
తాజాగా ఈ సాంగ్ కి సంబంధించి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఒక స్టిల్ కి అభిమానులు విపరీతంగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య రెడ్ కలర్ సూట్ లో దంచవే మేనత్త స్టెప్పులు వేయడం చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక కాజల్, శ్రీ లీల ఇద్దరూ లంగా – ఓణిలో ట్రెడిషనల్ బ్యూటీ లాగా మెరిసిపోతున్నారు. బ్యాక్ గ్రౌండ్ మొత్తం కలర్ ఫుల్ గా పండగ వాతావరణం తలపించే విధంగా మెస్మరైజింగ్ గా ఉంది. ఇక ఈ వారం విడుదలైన సినిమాలలో బాలయ్య చిత్రానికి పోటీ వచ్చే అంత రేంజ్ సినిమా ఏదీ లేదు. ఒక్క మార్టిన్ లూథర్ కింగ్ మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. కాబట్టి ఈ వీకెండ్ కూడా భగవంత్ కేసరి వీర విహారం చేయడం కన్ఫామ్.
Mahesh Babu: చెప్పలేని కాంట్రవర్సీల కారణంగా మహేష్ తో మూవీ వద్దనుకున్న రేణు దేశాయ్..