Bhagyashree: నీ జత లేక పిచ్చిది కాదా.. మనసంతా.. ఈ సాంగ్ ఎన్ని తరాలు మారినా ఈ సాంగ్ మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. గతేడాది ఈ సాంగ్, అందులోని డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన చిత్రం మైనే ప్యార్ కియా. ఈ చిత్రానికి సూరజ్ బార్జ్యాత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఒకే ఒక్క సినిమాతో భాగ్యశ్రీ నేషనల్ వైడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. హిందీలోనే కాదు తెలుగులో కూడా ఆమె స్టార్ గా మారింది.
తెలుగులో ఈ సినిమా ప్రేమ పావురాలు అనే పేరుతో డబ్ అయ్యింది. ఇక తెలుగులో కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమయ్యిన ఆమె హిమాలయ దాసాని అనే బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది. ఆమెకు ఒక కూతురు.. ఒక కుమారుడు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోగా, హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సర్ అనే సినిమాలో భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Shiva Rajkumar: క్యాన్సర్ ను జయించా.. శివన్న వీడియో వైరల్
ఇక భాగ్యశ్రీ కూడా చాలా కాలం తరువాత రాధేశ్యామ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ఆమె కనిపించింది. ఈ సినిమా తరువాత భాగ్యశ్రీకి తెలుగులో మంచి మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రేమ పావురాలు సినిమా సెట్ లో సల్మాన్ ఖాన్ చేసిన ఒక పని గురించి చెప్పుకొచ్చింది. ఆయన ప్రవర్తన చూసి అపార్థం చేసుకున్నాను అని తెలిపింది.
” ప్రేమ పావురాలు షూటింగ్ సమయంలో ఒకరోజు సల్మాన్ ఖాన్ .. నేను కూర్చున్న చైర్ పక్కకు వచ్చి నా చెవి దగ్గర ప్రేమ పాట పాడుతున్నాడు. ఎప్పుడు లేనిది ఈయన ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. ఆ రోజంతా నా వెంటపడ్డాడు. ఆయన ప్రవర్తన చూసి నేను షాక్ అయ్యాను. ఏం చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. . ఏదో సరదాకు ఆట పట్టిస్తున్నాడు అనుకున్నాను. ఇంకా హద్దు మీరీ ప్రవర్తిస్తున్నాడు. దీంతో మీరెందుకు ఇలా చేస్తున్నారు అని కోప్పడ్డాను.
Sowmya Rao : యాంకర్ సౌమ్య కు హైపర్ ఆదికి పెళ్లి.. కానీ అతనిపై మోజు..
వెంటనే ఆయన నన్ను పక్కకు తీసుకెళ్లి.. నువ్వు ఎవరితో ప్రేమలో ఉన్నావో నాకు తెలుసులే.. నీ లవర్ హిమాలయ గురించి కూడా నాకు తెలుసు.. ఒకసారి ఆయనను సెట్ కు పిలవచ్చు కదా అని అన్నారు. నేను షాక్ అయ్యాను. నా లవ్ మ్యాటర్ ఆయనకు ఎలా తెలిసిందో అని అనుకున్నాను. అప్పుడు అర్ధం అయ్యింది నాకు.. నా లవ్ గురించి తెలిసి నన్ను ఇలా ఆట పట్టించారని.. నేనే సల్మాన్ ఖాన్ ను అపార్థం చేసుకున్నాను” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక సల్మాన్ ఖాన్ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు. తన కెరీర్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ తో ప్రేమలో పడిన సల్మాన్.. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోయాడు. ఆయనతో ప్రేమలో పడిన ప్రతి హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే.. సల్లు భాయ్ మాత్రం అలా సింగిల్ గా మిలిగిలిపోయాడు.