Jobs in Telecommunication Department of Government of India: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఇండియన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో మొత్తం 48 సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: టెలికమ్యూనికేషన్స్ విభాగంలో మొత్తం 48 సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు: గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: నెలకు రూ.47,600-రూ.1,51,100 వరకు ఇస్తారు.
Also Read: Cement Corporation of India jobs: టెన్త్ పాసైతే చాలు.. నెలకు రూ.40,000.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.. https://dot.gov.in/ లేదా మీ అప్లికేషన్ ఫారమ్‌ను సంచార్ భవన్, ఆశోక రోడ్, న్యూఢిల్లీ-110001కి పంపండి.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జనవరి 14