Shiva Rajkumar: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముద్దుగా ఆయనను అందరూ శివన్న అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన వయస్సు 62 ఏళ్లు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆ మధ్య జైలర్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించిన శివన్న.. ఆ తరువాత భైరతి రనగళ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ప్రస్తుతం శివన్న.. తెలుగులో RC16 లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన క్యాన్సర్ బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ మరణించాకా.. శివన్న ఒంటరివాడు అయ్యాడు. అందులోనూ వయస్సు పైబడడం.. ఇలాంటి సమయంలో ఆయనకు క్యాన్సర్ అని తెలియడంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన ఈ వ్యాధితో పోరాడుతున్నా.. బయట ఎవరికి తెలియలేదు. కానీ, ఈ మధ్యనే శివన్న అధికారికంగా తానూ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ఫ్యాన్స్ కు తెలిపాడు.
RAPO22: సాగర్ గాడి గర్ల్ ఫ్రెండ్.. మహాలక్ష్మీలా కళకళలాడుతుందే
ఇక ఈ క్యాన్సర్ చికిత్స కోసం ఆయన గత నెల అమెరికాకు వెళ్లారు. అక్కడ ఫ్లోరిడాలోని మియామీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక శివన్న త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్ధించడం మొదలుపెట్టారు. అభిమానుల ప్రార్థనలు విన్న దేవుడు.. శివన్న క్యాన్సర్ చికిత్సను విజయవంతంగా పూర్తీ అయ్యేలా చేశాడు. తాజాగా శివన్న ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో ఆయన తాను క్యాన్సర్ ను జయించినట్లు తెలిపాడు.
” ఏ మనిషికి అయినా తనకు క్యాన్సర్ సోకిందని తెలియగానే ఒక భయం వెంటాడుతుంది. అందుకు నేను అతీతుడను కాను. నేను కూడా భయపడ్డాను. కానీ, నా భయాన్ని నా భార్య గీత, నా ఫ్యాన్స్ పోగొట్టారు. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నాకు ఎంతో సహకరించారు. నేనెప్పుడూ వారికి రుణపడి ఉంటాను. నా సినిమాల కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఒకపక్క కీమో థెరఫీ చేయించుకుంటేనే.. ఇంకోపక్క నా సినిమా షూటింగ్ పూర్తిచేశాను. ఆ సమయంలో వైద్యులు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. వారికి రుణపడి ఉంటాను. ప్రస్తుతం చికిత్స తుదిదశకు చేరుకుంది. త్వరలోనే మీ అందరి ముందుకు వస్తాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని చెప్పుకొచ్చాడు.
Vidaamuyarchi: పొంగళ్ రేస్ నుంచి తప్పుకున్న అజిత్ మూవీ.. ఏమైందంటే..?
ఇక శివన్న భార్య గీత మాట్లాడుతూ.. ” నా భర్త క్యాన్సర్ ను జయించారు. ఆయన త్వరలోనే మీ అందరి ముందుకు వస్తారు” అని తెలిపింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శివన్న త్వరగా కోలుకొని మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
#Shivanna is officially cancer-free. He thanks fans for their best wishes and sends back his love ❤️❤️❤️#ShivaRajkumar #DrShivaRajkumar #ಶಿವಣ್ಣ @NimmaShivanna #BhairathiRanagal pic.twitter.com/EGC933JUru
— Mahantesh Naik (@MahanteshBSNaik) January 1, 2025