Kantara 2.. కాంతారా 2.. ఏ ముహూర్తాన సినిమా షూటింగ్ మొదలు పెట్టారో తెలియదు కానీ నిజజీవితంలో అసలైన భయం ఏంటో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా దేవుడు ఉన్నాడు.. దేవుడితో ఆటలు ఆడడం సమంజసం కాదు అని.. ఈ సంఘటనలు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. రిషబ్ శెట్టి కాంతారా 2( Kantara 2)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన ప్రారంభించారో తెలియదు కానీ వరుస విషాదాలు మాత్రం అందరిలో భయాలను పుట్టిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటివరకు ముగ్గురు ఈ సినిమా కోసం పని చేసిన వారు చనిపోగా.. ఇప్పుడు ఏకంగా హీరో ఆ ప్రమాదం నుండి బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈసారి హీరోకే ప్రమాదం..
అసలు విషయంలోకి వెళ్తే.. కాంతారా 2 సినిమా షూటింగ్లో ఇప్పుడు మరో ప్రమాదం చోటుచేసుకుంది.. కర్ణాటకలోని మస్తికట్ట వద్ద ఉన్న రిజర్వాయర్లో రాత్రివేళ నటుడు రిషబ్ శెట్టితో సహా 30 మందికి పైగా ఉన్న పడవ బోల్తా పడింది.. అయితే వారంతా క్షేమంగా ఒడ్డుకు ఈత కొట్టుకుంటూ వచ్చారని సమాచారం. ఇకపోతే ఈ ప్రమాదంలో షూటింగ్ కోసం తీసుకెళ్లిన కెమెరాలు, ఇతర వస్తువులు అన్ని నీటిలో మునిగిపోయాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగ్ సెట్లో ఇలా వరుస విషాదాలు చూస్తే ఏదో అతిపెద్ద ప్రమాదమే జరగబోతోంది అని అందరూ భయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
ఇప్పటివరకు ముగ్గురు మృతి.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమా కోసం తమ ప్రాణాలను అర్పించారు. మృతుల వివరాల విషయానికి వస్తే.. 2024 నవంబర్లో సినిమా షూటింగ్ నిమిత్తం జూనియర్ ఆర్టిస్టులందరూ ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ బస్సు కొల్లూరు సమీపంలోని జడ్కల్ లో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా.. ప్రాణాపాయం నుండి అందరూ బయటపడ్డారు.
ఇక తర్వాత కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్టు ఎం.ఎఫ్ కపిల్.. ఈ ఏడాది మే నెలలో కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి గుర్తు తెలియని రీతిలో మరణించారు.
ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే అదే మే నెల 12వ తేదీన కాంతారా కళాకారుడు రాకేష్ పూజారి కూడా గుండెపోటుతో మరణించారు..
వీరే కాకుండా కేరళలోని త్రిసూర్ కి చెందిన విజు వీకే కూడా సినిమా షూటింగ్ కి వచ్చి ఆయన కూడా గుండెపోటుతో మరణించారు. ఇలా ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు హీరో ఉన్న పడవకే ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Tollywood: ఈ మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగిందా.. అసలేం జరిగిందంటే?