Cholesterol Control Tips: నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. క్రమరహిత లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ , శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణంగా మారుతోంది. ఇది నేరుగా గుండె జబ్బులకు మూలంగా మారుతుంది. ఈ కొలెస్ట్రాల్ ధమనుల గోడలపై పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఫలితంగా గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అంతే కాకుండా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కానీ మంచి విషయం ఏమిటంటే ఈ ప్రమాదకరమైన కొలెస్ట్రాల్‌ను కొన్ని సాధారణ హోం రెమెడీస్‌తో పాటు లైఫ్ స్టైల్ మార్పుల వల్ల నియంత్రించవచ్చు. దీనికి ఖరీదైన మందులు లేదా సంక్లిష్టమైన చికిత్స అవసరం లేదు. రోజువారీ ఆహారం, లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులతో.. గుండెను బలోపేతం చేయవచ్చు. అంతే కాకుండా రక్త నాళాలను కూడా శుభ్రపరచుకోవచ్చు.
ఓట్స్‌తో మీ రోజును ప్రారంభించండి:
ఓట్స్‌లో లభించే కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్, శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను నిరోధించడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజు ఉదయం మీరు టిఫిన్ లో భాగంగా ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
వేగంగా నడవడం:
ప్రతిరోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం అనేది గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచడమే కాకుండా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. నడక బరువు తగ్గడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మీ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
డ్రై ఫ్రూట్స్:
బాదం, వాల్‌నట్‌లు, వేరుశనగలు, అవిసె గింజలు వంటి విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె కండరాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
Also Read: రాత్రి సరిగ్గా నిద్ర పట్టడం లేదా ? కారణాలివే కావచ్చు !
ఆలివ్ నూనె వాడండి:
మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నూనెను మార్చడం కూడా సులభమైన మార్గం. ఆలివ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా గుండె ధమనులకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది.
గ్రీన్ టీ తాగండి:
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్ యాంటీ ఆక్సిడెంట్లు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మీ గుండెకు మేలు జరుగుతుంది. అంతే శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది.