BigTV English

Single Collections : ‘సింగిల్’ టాక్ పాజిటివ్.. కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..?

Single Collections : ‘సింగిల్’ టాక్ పాజిటివ్.. కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..?

Single Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం సింగిల్.. గత ఏడాది నటించిన స్వాగ్ మూవీతో మిక్స్డ్ టాక్ని అందుకున్న శ్రీ విష్ణు ఈ ఏడాది సింగిల్ సినిమాతో మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్నాడు.. ఈ సినిమా మే 9న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్నే సొంతం చేస్తుంది..ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో లేవు. అనేక ప్రాంతాల్లో ఓపెనింగ్స్ బిలో యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. ఇక మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్ అని వసూలు చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం..


సింగిల్ కలెక్షన్స్..

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మొదట కమెడియన్గా తన సత్తాని చాటాడు.. పలు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ గా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ ఏడాది సింగిల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. మొదటినుంచి పోస్టర్స్ టీచర్స్ తో మంచి రెస్పాన్స్ని అందుకున్న ఈ సినిమాకు మొదటి రోజు టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ మూవీ దాదాపు 8 కోట్ల షేర్.. 16 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ఏమాత్రం కలెక్షన్స్ వచ్చాయో మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండు కోట్ల వరకు వసూళ్లను రాబట్టిందని టాక్. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అనౌన్స్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

మూవీ స్టోరీ విషయానికొస్తే..

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఫన్, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించగా విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ నిర్మించారు. కార్తీక్ రాజు దర్శకత్వం ఈ మూవీని రూపొందించారు..ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 8 కోట్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.. సింగిల్ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమాకు మీడియం రేంజ్‌లో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. తొలి రోజు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల గ్రాస్, 1. 5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.. ఇక రెండో రోజు వీకెండ్ కావడంతో ఓపెనింగ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.. మరి ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×