BigTV English

Jasprit Bumrah: కొడుకు ముందు రెచ్చిపోయిన బుమ్ బుమ్ బుమ్రా.. లక్ అంటే ఇదే కదా

Jasprit Bumrah: కొడుకు ముందు రెచ్చిపోయిన బుమ్ బుమ్ బుమ్రా.. లక్ అంటే ఇదే కదా

Jasprit Bumrah:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏకంగా 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లో అదరగొట్టిన ముంబై ఇండియన్స్… లక్నో సూపర్ జెంట్స్ జట్టును చిత్తు చేసింది. అయితే ఈ… ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొట్టాడు. ఇంజురీ అయిన తర్వాత… ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి తొలిసారిగా బంపర్ పర్ఫామెన్స్ చూపించాడు జస్‌ప్రీత్ బుమ్రా.


Also Read: Sarfaraz Khan – Ananya Bangar : గే తో సర్ఫరాజ్ ఖాన్ రిలేషన్… వీడియో వైరల్

దుమ్ము లేపిన జస్‌ప్రీత్ బుమ్రా


ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సూపర్ హీరోగా జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ కారణంగానే…. 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెంట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ గెలిచిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసిన బుమ్రా మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో…. 22 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో లక్నో సూపర్ జెంట్స్ జట్టు కకవికలమైంది.

కొడుకు ముందే రెచ్చిపోయిన బుమ్రా

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల ( Mumbai Indians vs Lucknow Super Giants Teams ) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో దుస్థితి జస్‌ప్రీత్ బుమ్రా కుటుంబం కూడా ఈ స్టేడియానికి రావడం జరిగింది. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా కొడుకు అంగద్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా వచ్చాడు. ఇక తన తండ్రి బౌలింగ్ లో అదరగొడుతుంటే కొడుకు… ప్రేక్షకుల మధ్య కూర్చొని ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొడుకు ఉన్నాడని జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah  ) రెచ్చిపోయాడని అంటున్నారు.

Also Read: Rishabh Pant : రిషభ్ పంత్ పై దారుణంగా ట్రోలింగ్.. నువ్వు ఎందుకు ఆడుతున్నావు అంటూ

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో రిక్వెల్టన్ 58 పరుగులు చేయగా విల్ జాక్స్ 29 పరుగులు.. చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 54 పరుగులతో దుమ్ము లేపాడు. చివరలో నమాన్ 25 పరుగులు చేయగా కోర్బిన్ 20 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్… దారుణంగా విఫలమైంది. 20 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది లక్నో. దీంతో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెంట్స్… 54 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×