Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ సంచలనం. 14 ఏళ్ల వయసులోనే ఐపిఎల్ లో అడుగుపెట్టిన అద్భుత ప్రతిభావంతుడు. తన తండ్రి అండతో ఎంతగానో కష్టపడి గ్రామీణ క్రికెట్ నుండి ఐపీఎల్ వరకు తన ప్రయాణాన్ని సాగించాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టుకు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
Also Read: Siddharth Kaul: టీమిండియాలో ఛాన్సులు రాక… బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్న SRH ప్లేయర్
తన అరంగేట్ర మ్యాచ్ లోనే తొలి బంతికే సిక్స్ బాదిన సూర్యవంశీ.. ఆ మ్యాచ్ లో సెన్సేషనల్ బ్యాటింగ్ కొనసాగించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మొత్తంగా 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 34 పరుగులు చేసి అద్భుతం చేశాడు. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 11 సిక్స్ లు ఉన్నాయి. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తో 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో రెండవ వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
అలాగే t-20 ల్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ లో పర్యటించిన ఇండియా అండర్ – 19 జట్టులో స్థానం కూడా సంపాదించాడు. ఇలా అతి చిన్న వయసులో రికార్డులు క్రియేట్ చేస్తూ ఎంతోమంది క్రీడాభిమానుల మన్ననలు పొందాడు వైభవ్ సూర్యవంశి.
ఇలాంటి ప్లేయర్ ని మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అతడు ప్రాక్టీస్ కి వెళుతుండగా కలిశాడు. ఈ సందర్భంగా అతడు తీసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో హిందీ రాక ఇబ్బంది పడుతూ ఆ తెలుగు వ్యక్తి హిందీలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అతడు వైభవ్ సూర్యవంశీతో సెల్ఫీ వీడియో తీస్తూ ఏం మాట్లాడాడు అంటే..
“ఇప్పుడు మనం వైభవ్ గారితో హే. వైభవ్ ఫ్యూచర్ మే వరల్డ్ కప్ ఆథా. వైభవ్ అప్నేకు వైభవ్ వరల్డ్ కప్ లేఖే ఆయేగా ” అని తనకు హిందీ రాకపోయినా అలా మాట్లాడుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇక తాజాగా వైభవ్ సూర్యవంశి తండ్రి సంజీవ్ తన కుమారుడి ఎదుగుదల, ప్రస్తుత పరిస్థితి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కుమారుడు సాధించిన విజయాల వల్ల తనకు లభిస్తున్న గుర్తింపు పట్ల ప్రతి తండ్రిలాగే ఆనందంగా ఉన్నానని అన్నారు. అలాగే వైభవ్ తన ఫిట్నెస్ పై మరింత దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు.
Also Read: Najmul Hassan Shanto: బంగ్లాదేశ్ కెప్టెన్ పై హ**త్యాయత్నం.. ఏకంగా గ్రౌండ్ లోనే ఇంత దారుణమా
” ప్రతి తండ్రికి తన కొడుకు పేరుతో గుర్తింపు వస్తే ఎంత గర్వంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నేను కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. నన్ను కలవడానికి ఎంతో దూరం నుండి వస్తున్నారు. నా కుమారుడు ఇంత చిన్న వయసులోనే ఐపిఎల్ లో పరుగులు చేయడం చూసి గర్వపడుతున్నాను. కానీ వైభవ్ ప్రస్తుతం బరువు పెరిగాడు. ఆ బరువు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అతడు ప్రస్తుతం రోజు సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నాడు. రోజు జిమ్ కి కూడా వెళుతున్నాడు” అని చెప్పుకొచ్చాడు వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">