BigTV English

Ranya Rao : స్మగ్లింగ్ కేసులో నటికి బిగ్ షాక్..జైలుకు వెళ్లాల్సిందే..!

Ranya Rao : స్మగ్లింగ్ కేసులో నటికి బిగ్ షాక్..జైలుకు వెళ్లాల్సిందే..!

Ranya Rao : కన్నడ హీరోయిన్ రన్యా రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో ఒకప్పుడు చేసి బిజీగా ఉంది. ఈమధ్య సీరియల్ లో కీలకపాత్రలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. అయితే ఈమె ఇటీవల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి అక్రమంగా గోల్డ్ తరలిస్తున్న కేసులో అధికారులు ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఈమె కేసు అనేక మలుపులు తిరిగి ప్రస్తుతం విచారణ పూర్తి చేసుకుంది. ఈ కేసులో నటికీ సపోర్టుగా పలువురు ప్రముఖులు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. తాజాగా ఈమెకు కోర్టు లో బిగ్ షాక్ ఎదురైంది..


గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన నటి.. 

ఈ ఏడాది మార్చి 3న దుబాయ్ నుంచి ఇండియాకి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ ఎయిర్ పోర్ట్ లోని అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె బెయిల్ కోసం ఎంతగా ప్రయత్నించినా మూడుసార్లు విఫలమైంది. ఆమెను అరెస్ట్ చేసిన నాటి నుంచి ఈ కేసులో చిక్కు ముడులు విప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రన్యా రావు బెయిల్ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఈమె కేసు పై పూర్తిగా విచారించడం కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాటుగా ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పేసింది.. ప్రస్తుతం నేను జీవితం జైలుకే అంకితమైంది.. రన్యా రావుతో పాటు మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేయగా వారు బెంగళూరు సెంట్రల్ జైళ్లో ఉన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ కేసును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లు దర్యాప్తు చేస్తున్నాయి. త్వరలోనే ఈ కేసు గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు.


రన్యా రావు పర్సనల్ లైఫ్.. 

ఈరోజు హీరోయిన్ గురించి చెప్పాలంటే ఈమె కర్ణాటకలో పుట్టింది. సుదీప్ దర్శకత్వంలో వచ్చిన మాణిక్యలో హీరోయిన్‌గా నటించారు . తర్వాత వాఘా, పటాకీ సినిమాల లో నటించారు. ఆ తర్వాత సినిమాలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చెయ్యాలని అనుకుంది. కానీ తన భర్తతో విభేదాలు రావడం తో పెళ్లయిన నెలకి భర్తకు దూరమైంది. ఆ తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆమె ఇలా గత కొన్ని లుగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ లక్షలు సంపాదిస్తుంది. ఏడాదికి 12సార్లు ఆమె దుబాయ్ నుంచి ఇండియాకు బంగారు అన్ని తరలిస్తుందని విచారణలో ఒప్పుకుంది. ఒకసారి బంగారాన్ని తీసుకొస్తే 12 లక్షల వరకు ఆమెకు దక్కుతుందని ఆమె బయట పెట్టారు. ప్రస్తుతం ఈ కేసును అన్నీ కోణాల్లో అధికారులు విచారణ చేపడుతున్నారు.. త్వరలోనే ఈ కేసులో ఈమెకు సపోర్ట్ గా ఉన్న పలువురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.. ప్రస్తుతం నటి మరో ఏడాది పాటు జైల్లోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×