BigTV English

Pakistan Terrorism All Party: పాక్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటిచెబుదాం.. విదేశాలకు అఖిలపక్షం నేతల బృందం

Pakistan Terrorism All Party: పాక్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటిచెబుదాం.. విదేశాలకు అఖిలపక్షం నేతల బృందం

Pakistan Terrorism All Party| ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల సమయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ నిజస్వరూపం గురించి చాటి చెప్పడానికి భారత్ తరపున అన్ని పార్టీలకు చెందిన నాయకులను బృందంగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపనుంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యూరప్ మరియు మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతును బహిర్గతం చేయడం లక్ష్యంగా, భారత ప్రభుత్వం పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది.


ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ కూడా ఉండనున్నారు. ఈ అంశంపై స్పందించిన కేరళ కాంగ్రెస్ పార్టీ, శశిథరూర్‌కు మద్దతుగా X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. దేశానికి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ ప్రతినిధుల అవసరం ఉందని పేర్కొంది. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రుల విశ్వసనీయత దిగజారిన సమయంలో, దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చే స్వరం అవసరమని చెప్పింది. బీజేపీలో ప్రతిభలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రత్యుత్తరంగా కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్” చేపట్టింది. దానికి అనుబంధంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రధాన స్థాయి దౌత్య కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 40 మంది పార్లమెంటు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరిని ఏడుగురు గుంపులుగా విభజించి, ప్రతి గ్రూపులో 7–8 మంది ఎంపీలు ఉండేలా ప్లాన్ చేసింది. మే 22–23 తేదీల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం 10 రోజుల పాటు సాగనుంది. ప్రతి బృందం 4 నుంచి 5 దేశాలను సందర్శించనుంది. ఈ బృందాలకు భారత విదేశాంగ శాఖకు చెందిన ఒక అధికారి కూడా తోడుగా ఉంటారు.


ఈ బృందంలో పాల్గొనబోయే కాంగ్రెస్ నేతలు శశిథరూర్‌, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్‌లు. వీరిని ఇప్పటికే సంప్రదించామని, వారు పాల్గొనడానికి అంగీకరించారని పిటిఐ వార్తలో తెలిపింది. బీజేపీ తరపున అపరాజిత సారంగి, అనురాగ్ ఠాకూర్ లాంటి నాయకులు బృందంలో ఉండనున్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఇందులో భాగం కానున్నారు. వీరిలో టీఎంసీకి చెందిన సుదీప్ బంద్యోపాధ్యాయ్, జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర, ఎన్‌సీపీ (ఎస్‌పీ) కు చెందిన సుప్రియా సూలే, డీఎంకే నేత కనిమొళి, సీపీఐ (ఎం) నేత జాన్ బ్రిట్టాస్, ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. మే 22 నాటికి ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించబడిందని సమాచారం.

అంతేకాక, కేంద్ర ప్రభుత్వం ఈ దౌత్య యాత్రల ప్రణాళికపై ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఈ ప్రణాళికకు సంబంధించిన చర్చలు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్టీ నాయకులతో జరిపారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. విదేశీ దేశాలకు పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతు, దుశ్చర్యలపై ఆధారాలు, వాస్తవాలు వివరించేందుకు విదేశాంగ, హోం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: పాక్ ఆ పని చేసేంతవరకు సింధూ జలాల ఒప్ఫందంపై చర్చలు ఉండవు.. తేల్చి చెప్పిన జై శంకర్

ఈ దౌత్య కార్యక్రమంలో భాగంగా 7 ప్రాంతాలకు పార్లమెంటరీ బృందాలు వెళ్లనున్నాయి. శశిథరూర్ నేతృత్వంలోని బృందం అమెరికాకు పయనమవుతుంది. తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం వెళ్తుంది. రష్యాకు వెళ్లే బృందానికి  కనిమొళి  నాయకత్వం వహిస్తారు. ఆగ్నేయాసియా దేశాలకు సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం వెళ్తుంది. మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో బృందం పయనమవుతుంది. పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే నాయకత్వం వహిస్తారు. ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే నేతృత్వం వహించనున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రతినిధి బృందాల ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతును అంతర్జాతీయంగా ఎండగట్టడం. ప్రతి బృందం తమ తమ లక్ష్య దేశాల్లో పాక్ ఉగ్రవాదం, దుష్ప్రవర్తనలపై వాస్తవాలను వివరించనుంది.

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×