Big TV Kissik Talks:బిగ్ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్'(Kissik Talks) అనే కార్యక్రమానికి అటు ఆడియన్స్ నుండి ఇటు సెలబ్రిటీల నుండి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి సీనియర్ స్టార్ సెలబ్రిటీలను మొదలుకొని, యంగ్ సెలబ్రిటీల వరకు ఈ షోకి హాజరయ్యి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవిత విశేషాలను పంచుకుంటూ ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే చివరి ఎపిసోడ్లో ప్రముఖ సీనియర్ నటులు బాబు మోహన్ (Babu Mohan) వచ్చి సందడి చేయగా.. ఇప్పుడు అందాల తార సీనియర్ స్టార్ హీరోయిన్ ఆమని విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో జబర్దస్త్ వర్ష (Jabardast Varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమని మనకు తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నారు. అంతేకాదు ఆడపిల్ల పుట్టగానే అందరి తల్లిదండ్రుల లాగే తాను కూడా ఏడ్చానని అందరూ అనుకున్నారు.. కానీ, తన కన్నీటి వెనుక ఉన్న కష్టం, భవిష్యత్తు ఆలోచనలు ఎవరికీ తెలియవు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఆమని.
ఆమని సినిమా కెరియర్..
ఆమని విషయానికి వస్తే.. 1973 నవంబర్ 16న ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరులో జన్మించిన ఆమని.. ఈ.వీ.వీ.సత్యనారాయణ (EVV Sathyanarayana) దర్శకత్వం వహించిన ‘జంబలకడిపంబ’ సినిమాతో నరేష్ (Naresh)పక్కన హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తను నటనను ప్రూవ్ చేసుకున్న ఈమె.. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో నటించింది. ఈ సినిమాకి ఉత్తమ జాతీయ చిత్రంగా నేషనల్ అవార్డు రాగా.. ఈ సినిమాలో ఆమని నటనకు ఉత్తమ నటి విభాగంలో నంది అవార్డు లభించింది. ఇక తర్వాత జగపతిబాబు(Jagapathi babu) హీరోగా.. రోజా (Roja) తో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆమని. అదే శుభలగ్నం.. ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో డబ్బుకు ఆశపడి భర్తను అమ్ముకునే మహిళగా నటించి, తన నటనతో ఊహించని ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పీక్స్ లో ఉండగానే కోలీవుడ్ దర్శకుడు ఖాజా మోహియుద్దీన్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక 2004లో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించిన ‘మధ్యాహ్నం హత్య’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేస్తూ.. అటు బుల్లితెరపై కూడా సందడి చేసింది. సీరియల్స్ తో పాటు పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది ఆమని.
ఆడపిల్ల పుట్టిందని కన్నీళ్లు పెట్టుకున్న ఆమని.. అసలు నిజం ఏంటంటే..?
ఇక తాజాగా కిస్సిక్ టాక్స్ షో కి వచ్చిన ఈమె.. అందులో భాగంగానే సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలిపింది. ఆమని మాట్లాడుతూ..” నాకు డెలివరీ అయిన తర్వాత బేబీ గర్ల్ పుట్టిందని డాక్టర్ చెప్పగానే.. ఒక్కసారిగా నా రెండు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నాకు ఆడపిల్ల పుట్టింది అన్న బాధ కాదు..ఈ సమాజం నుండి ఆ పాపను ఎలా రక్షించాలి అనే ఆలోచన నా కళ్ళల్లో భయాన్ని కన్నీటి రూపంలో బయటకు తోసింది. ప్రస్తుత సమాజం ఎలా మారిపోయింది అంటే తల్లిదండ్రులు అమ్మాయిలను కనాలి అనే ఆలోచన కూడా చేయడం లేదు” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది ఆమని.ఇక ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ కల్పించడానికి ఎన్ని చట్టాలు వచ్చినా ఎక్కడో ఒకచోట ఆడవారికి అన్యాయం జరుగుతూనే వుంది. వయసుతో సంబంధం లేకుండా అత్యంత దారుణంగా అత్యాచారాలు చేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఆడపిల్ల కూడా తనకంటూ సొంతంగా పోరాడే శక్తిని సమకూర్చుకోవాలి అని, ప్రతి అమ్మాయి నారీ శక్తి కావాలి అని పిలుపునిచ్చింది ఆమని. ఇక ప్రస్తుతం ఆమని చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Faria Abdullah: అలాంటి ఛాన్స్ కావాలంటున్న ఫరియా.. మరి హీరోలు ఒప్పుకుంటారా..?