Faria Abdullah:ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆరడుగుల పొడవున్న ఈమె ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు(Maheshbabu ) లాంటి స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపరిచింది. అవకాశం వస్తే ఇలాంటి హీరోల సరసన తప్ప మరే హీరో పక్కన అవకాశం వచ్చినా పెద్దగా సెట్ కాదనే భావన ఇప్పుడు ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలపై కూడా పడిందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ‘జాతి రత్నాలు’ సినిమా ద్వారా చిట్టి క్యారెక్టర్ లో ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా అబ్దుల్లా.. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టం ఈమెను తలుపు తట్టలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది ఫరియా అబ్దుల్లా.
డాన్సర్ మాత్రమే కాదు సింగర్ కూడా..
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో శేఖర్ మాస్టర్ (Sekhar master) తో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది ఫరియా. ఇక ఈ సినిమా తర్వాత నైనా అవకాశాలు వస్తాయనుకుంటే అది జరగలేదు. దీంతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను, తాను డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఒక డాన్స్ షో కి ఫరియా అబ్దుల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు అక్కడ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది కూడా.. ఇకపోతే ఒక సినిమాకు గతంలో డాన్స్ కంపోజ్ చేసిన ఈమె ర్యాపో సింగర్ గా కూడా మంచి పేరు దక్కించుకుంది.
అవకాశం వస్తే హీరోయిన్ కాదు డాన్స్ కంపోజర్ అవుతా – ఫరియా
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా.. అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాకి కొరియోగ్రఫీ చేయాలని ఉంది అని తెలిపింది. అంతేకాదు ఇదే విషయంపై అల్లు అర్జున్ ను తాను కలిసినప్పుడు అల్లు అర్జున్ ఏమన్నాడు అనే విషయాన్ని కూడా తెలిపింది ఫరియా అబ్దుల్లా. ఈమె మాట్లాడుతూ..” నేను అల్లు అర్జున్ ని కలిసినప్పుడు నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు కదా అని అడిగాడు. మీకు ఎలా తెలుసు అని అడిగితే, నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి. త్వరలోనే మనం ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామని నాకు మాట ఇచ్చాడు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ఆయన సినిమాకి నేను డాన్స్ కంపోజర్ గా పని చేయాలనుకుంటున్నాను. ఇక అల్లు అర్జున్ కే కాదు సినిమాలలో నాకు హీరోయిన్గా అవకాశం రాకపోయినా పర్లేదు. స్టార్ హీరోలు అందరికీ కూడా కొరియోగ్రఫీ చేసే అవకాశం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ తెలిపింది ఫరియా అబ్దుల్లా. మొత్తానికి ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే హీరోయిన్ గా కాకుండా డాన్స్ కంపోజ్ చేస్తానని చెబుతున్న ఈమెకు ఎవరు డాన్స్ మాస్టర్ గా అవకాశం కల్పిస్తారో చూడాలి.
ALSO READ:Samantha : పెళ్లైన డైరెక్టర్ తో సమంత ఎఫైర్… మేనేజర్ బానే మేనేజ్ చేశాడా..?