BigTV English

Indian Railways: హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, ఏ ప్రాంతలకు వెళ్తాయంటే?

Indian Railways: హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, ఏ ప్రాంతలకు వెళ్తాయంటే?

Hyderabad -Kalaburagi  Special Trains: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను తీసుకురావడంలో ముందుంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే. పండుగలు, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కలబురగి (గుల్బర్గా)లో జరిగే హజ్రత్ ఖాజా బండారువాజ్ 621వ ఉర్స్-ఎ-షరీఫ్ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 14న మొదలైన ఈ వేడుకలు మే 31 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – కలబురగి- హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ వేడుకల కోసం నడిపించే రైళ్లలో రిజర్వేషన్ ఉండదని ప్రకటించింది.


అందుబాటులో నాలుగు ప్రత్యేక రైళ్లు

కలబురిగి ఉర్సు సందర్భంగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. మొత్తం 4 అన్ రిజర్వుడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌- గుల్బర్గా రూట్ లో రెండు, గుల్బర్గా- హైదరాబాద్‌ మార్గంలో 2 రైళ్లు నడుస్తాయని తెలిపారు.  ఉర్సుకు వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు.


 

Read Also: ఫారిన్ లో ఉన్న ఫీలింగ్ కలిగించే బెస్ట్ ఇండియన్ ప్లేసెస్, కచ్చితంగా వెళ్లాల్సిందే!

చర్లపల్లి- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు

అటు సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే  ప్రకటించింది. ఈ రైళ్లు 17, 18 తేదీల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రైలు నెంబర్ 07441 ఈ నెల 17న  చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, మరుసటి రోజు ఉదయం 03.35 విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 07442 విశాఖ నుంచి 18న బయల్దేరుతుంది. రాత్రి 11.00 గంటలకు వైజాగ్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.40 చర్లపల్లి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు  నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. చర్లపల్లి- విశాఖపట్నం ప్రత్యేక రైళ్లలో 3ఏసీ, 3 ఏసీ(ఎకానమీ) క్లాస్ కోచ్‌ లు ఉంటాయి.

Read Also: ఇండియాలో బెస్ట్ రివర్ రాఫ్టింగ్ డెస్టినేషన్స్.. కావాల్సినంత ఎంజాయ్ చేయండి!

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×