Tim David: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ ప్లేయర్లు అందరూ ఒక్కొక్కరు ఇండియాకు… చేరుకుంటున్నారు. రేపటి నుంచి అంటే మే 17వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు అందరూ స్క్వాడ్లో చేరిపోయారు. రేపటి నుంచి మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… విదేశీ ఆటగాళ్లు కూడా వచ్చేశారు.
Also Read: Hardik Pandya’s Ex wife : ప్రియుడితో కారులోనే సరసాలు.. నరకం అనుభవిస్తున్న పాండ్యా
బెంగళూరులో భారీ వర్షం
శుక్రవారం రోజున విదేశీ ప్లేయర్ లందరూ ఇండియాకు తరలివచ్చారు. ఇందులో భాగంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విదేశీ ప్లేయర్లు కూడా.. రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బెంగళూరు నగరంలో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో భారీ స్థాయిలో వర్షం కురవడంతో స్టేడియం మొత్తం నీళ్లతో కనిపించింది. అయితే ఆ సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో వర్షం పడడంతో ప్లేయర్ లందరూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయారు. నిన్న అర్ధరాత్రి మొత్తం వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో ప్లేయర్లు ఎవరూ కూడా మళ్లీ ప్రాక్టీస్ చేయడానికి ముందుకు రాలేదు.
వర్షంలో చిందులు వేసిన టీమ్ డేవిడ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డ చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో… ఆస్ట్రేలియా ఆటగాడు టీమ్ డేవిడ్ రచ్చ రచ్చ చేశాడు. స్టేడియంలో కురుస్తున్న నేపథ్యంలో బట్టలు విప్పేసి చిన్న పిల్లాడిలా డ్యాన్సులు చేశాడు. అలాగే ఒక దగ్గర నీళ్లు బాగా జమ కావడంతో… దాన్ని స్విమ్మింగ్ పూల్ లాగా ఫీల్ అయ్యాడు డేవిడ్. ఈ నేపథ్యంలోనే అందులో డైవింగ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరపడిపోతున్నారు. అసలు ఇండియాకు ఆస్ట్రేలియా ప్లేయర్లు తిరిగి రారు అనుకున్న సమయంలో.. అందరూ వచ్చేసి… ఇలా ఎంజాయ్… చేస్తున్నారని కూల్ అవుతున్నారు బెంగళూరు అభిమానులు.
రేపటి నుంచే ఐపిఎల్ 2025 పునః ప్రారంభం
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ( War between India vs Pakistan) నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. కేవలం 6 వేదికలలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు. జూన్ మూడో తేదీ వరకు… ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. అంటే జూన్ మూడో తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. జూన్ మూడో తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్… అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read: Andrew Symonds: వివాదాలకు కేరాఫ్ సైమండ్స్.. స్టేడియంలో ఫ్యాన్ ను చితకబాదాడు
Tim David enjoying the Bengaluru rain. 😂🔥 pic.twitter.com/nOKhZhHukO
— Johns. (@CricCrazyJohns) May 16, 2025