Game Changer: ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రస్తావన వస్తే దర్శకుడుగా మొదటి పేరు రాజమౌళి ది వినిపిస్తుంది. కానీ ఒకప్పుడు శంకర్ అంటేనే ఒక బ్రాండ్. శంకర్ సినిమా వస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉండేది. శంకర్ సినిమా థాట్స్ అన్ని కూడా వేరే లెవెల్ అని చెప్పాలి. ఎవరు ఊహించిన కాన్సెప్ట్ ను శంకర్ ఆ రోజుల్లో ఊహించి కమర్షియల్ వేలో ప్రేక్షకులకు అందించేవాడు. శంకర్ చేసిన కొన్ని సినిమాలు అద్భుతాలు అని చెప్పాలి. అయితే మళ్లీ శంకర్ చేయాలనుకున్న కూడా అలాంటి సినిమాలు చేయలేరు. ఒక కమర్షియల్ సినిమాలు మెసేజ్ చూపించడం అనేది కేవలం శంకర్ కు మాత్రమే చెల్లింది. ఇప్పుడు చాలామంది దర్శకులు పాన్ ఇండియా కాన్సెప్ట్ సినిమాలు అంటూ వస్తున్నారు కానీ ఒకప్పుడు శంకర్ ఎంచుకున్న సినిమాలే పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవి. రోబో లాంటి సినిమాను అప్పట్లోనే శంకర్ తెరకెక్కించాడు అంటే అది మామూలు విషయం కాదు. మళ్లీ శంకర్ కు ఆ స్థాయి సినిమా ఇప్పటివరకు పడలేదు అనేది వాస్తవం.
డిజాస్టర్ గేమ్ చేంజర్
శంకర్ తో సినిమా చేయాలని ఒకప్పుడు స్టార్ హీరోలు అంతా కూడా కలలు కనేవాళ్ళు. అందులో శంకర్ తో ఏదో ఒక రోజు పని చేయాలి అని మెగాస్టార్ చిరంజీవి కూడా అనుకునేవారు. కానీ ఆ అదృష్టం మెగాస్టార్ చిరంజీవికి దక్కలేదు. అలా దక్కకపోవడం కూడా మంచిదే అని ఇప్పుడు కొంతమంది మెగా అభిమానుల ఆలోచన. మొత్తానికి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా విపరీతమైన అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. అయితే మొదటి షో పడిన వెంటనే ఈ సినిమా మీద నెగిటివ్ టాక్ మొదలైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇది డిజాస్టర్ అని దాదాపు ఆ చిత్ర యూనిట్ కి కూడా అర్థమయిపోయింది. ఈ సినిమాతో కోల్పోయిన నష్టాన్ని, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రికవరీ చేసుకున్నాడు దిల్ రాజు.
గేమ్ చేంజర్ వెనుక నిజాలు
గేమ్స్ సినిమా విడుదలైన తర్వాత ఆ ఫలితం తేడా కొట్టడంతో, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. అయితే శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా దాదాపు 5 గంటల వరకు ఫుటేజ్ ఉంటుంది దీన్ని ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇంకొంచెం జాగ్రత్తగా చేయాల్సింది అంటూ తెలిపారు. గేమ్ చేంజర్ సినిమాతో దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎడిటర్ షమీర్ ముహమ్మద్ ఇటీవలే చాలా అసభ్యకరంగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మొదట్లో దాదాపు 7.5 గంటలు నడిచింది, తర్వాత ఆయన దానిని 3 గంటలకు తీసుకొచ్చినట్లు రివిల్ చేశాడు. సినిమా ఫలితం అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు చాలామంది శంకర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: Bellamkonda Sai Srinivas : నీకు ఏమి రాకపోయినా, టైం కి షూటింగ్ కు వెళ్ళు