వైన్ షాపుల దగ్గర తాగుబోతులు చేసే హంగామా మామూలుగా ఉండదు. పీకల దాకా తాగిన తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. కొంత మంది బాగా తాగి కిందపడి పొర్లాడుతుంటారు. మరికొంత మందికి ఏం చేస్తున్నారో అర్థం కాదు. మద్యం దుకాణం దగ్గర ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి మాంచిగా మందు తాగి.. ఏకంగా పామునే మెడలో వేసుకుని హంగామా చేశాడు. అంతేకాదు, పాముకు చల్లని బీరు తాగించి హల్ చల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడులో తాగుబోతు వీరంగం
తమిళనాడులోని ధర్మపురి నిత్యం రద్దీగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఓ తాగుబోతు చేసిన పని అందరినీ భయంతో పాటు ఆశ్చర్యానికి గురి చేసింది. తాగిన మత్తులో ఏకంగా ఓ పామును మెడలో వేసుకుని రోడ్డు మీదికి వచ్చాడు. వస్తూ వస్తూ, బీరు బాటిల్ ఓపెన్ చేసి, దానికి కూడా తాగించాడు. రాజపెట్టైకి చెందిన సూర్య అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసి బాగా తాగాడు. ఆ తర్వాత ఓపామును పట్టుకుని మెడలో వేసుకున్నాడు. అయితే, దాని ఊపిరి ఆడకుండా మెడను పట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి చేరింది. ఆ తర్వాత పాము నోరు తెరిపించి మద్యం తగించాడు. రోడ్డు మధ్యలోని డివైడర్ మీద కూర్చొని ఆయన పాముకు మద్యం తాగించడాన్ని చూసి అందరూ షాకయ్యారు. అంతేకాదు, ఆ పామును దారిన పోయే వాళ్లకు చూపించి ముద్దుకూడా పెట్టుకున్నాడు.
Drunk Man Feeds Liquor to Snake in Tamil Nadu#Drunkman #snakes #tamilnadunews #tamilnadu pic.twitter.com/DdteGlqR2C
— avinashrambigtvenglish (@avinashrambigtv) June 13, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ పాము అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికలు చెప్పారు. ఈ విషయం గురించి పోలీసులకు తెలియడంతో స్పాట్ కు చేరుకుని అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. గత ఏడాది ఏపీలో తాగిన మత్తులో ఓ వ్యక్తి నాగుపాముతో ఆడుకోవడానికి ప్రయత్నించాడు. ఆ పాము అతడిని కాటు వేయడంతో హాస్పిటల్ పాలయ్యాడు. నిజానికి ఆ పాము నాగరాజు అనే యువకుడిని చూసి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించినా, దానితో ఆటలాడాలి అనుకున్నాడు. అది పారిపోతున్నా అడుకున్నాడు. కోపంతో ఊగిపోయిన పాము అతడిని కాటు చేసింది. కాటు వేయడంతో అతడు భయంతో వణికిపోయాడు. స్థానికులు అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో అతడి ప్రాణాలకు ముప్పు వాటిళ్లలేదు. కానీ, తమిళనాడులో సూర్య ఆ పాము తలను గట్టిగా పట్టుకోవడంతో అది సృహతప్పి పడిపోయింది. అందుకే, అతడిని కాటు వేయలేకపోయింది.
Read Also: భాగ్యనగరంలో అద్భుతం, దేశంలోనే అతి పెద్ద టన్నెల్ అక్వేరియం!