Bigg Boss Divi:ప్రముఖ నటి దివి వైద్య (Divi Vadthya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ఒక ఇమేజ్ అందుకున్న ఈమె బిగ్ బాస్(Bigg Boss) లోకి వెళ్లిన తర్వాత భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాతే వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అలా స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న ఈమె.. చిన్న హీరోల సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది. అంతేకాదు వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది కూడా.. ఇక గత ఏడాది డిసెంబర్లో వచ్చిన అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప 2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’ సినిమాలో కూడా మెరిసింది. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్న దివి.. మహేష్ బాబు(Maheshbabu) పుట్టుమచ్చల గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
Marco Movie : అదేం వయోలెన్స్… చూడలేక మధ్యలోనే వచ్చేశా… యంగ్ హీరో సంచలన కామెంట్
అక్కడ మహేష్ బాబుకి ఆ పుట్టుమచ్చ ఎంతో బాగుంది – దివి
దివి మాట్లాడుతూ.. నేను ‘మహర్షి’ సినిమాలో నటించాను. మహేష్ బాబును అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. ఆయన చాలా అందగాడు. ఆ సినిమా షూటింగ్లో అమ్మాయిలంతా కూడా మహేష్ గురించి, ఆయన అందం గురించే మాట్లాడుకునే వాళ్ళు. షూట్ లో ఒక అబ్బాయి కూడా బాగోడు. కానీ మహేష్ బాబు మాత్రం తళతళ మెరిసిపోతాడు. మహేష్ కి నాతో చాలా సన్నివేశాలు ఉన్నాయి.అందులో నాది పెద్ద రోల్. కానీ ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలు తీసేశారు. ఆయనకు నుదురు మీద పైకి పుట్టుమచ్చ ఉంటుంది. మా ఇద్దరి మధ్య సీన్ జరుగుతుంటే, గాలికి హెయిర్ పైకి అనుకుంటూ ఉండగా.. నేను ఆ పుట్టుమచ్చ చూశాను. ఆ సీన్ లో నేను, మహేష్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు మీ ఫోర్ హెడ్ మీద పుట్టుమచ్చ చాలా బాగుంది సార్ అని అన్నాను. వెంటనే నవ్వి, కట్ చెప్పి పడి పడి నవ్వారు. సితార (Sitara) కూడా ఇలాగే చెప్తుంది. సితారకి కూడా ఈ పుట్టుమచ్చ బాగుంటుందని చెప్పింది అంటూ మహేష్ నాతో చెప్పారు. అంతేకాదు మహర్షి సినిమాకు సంబంధించి బోలెడన్ని మెమోరీస్ ఉన్నాయి.. ఆయనతో మళ్ళీ చేయాలని ఉందని తెలిపింది దివి. ఇక ప్రస్తుతం దివి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఎస్ ఎస్ ఎం బి 29 లో నాకు అవకాశం కావాలి – దివి
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. కే.ఎల్. నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించాలని రాజమౌళి టీం లో తెలిసిన వాళ్లందర్నీ అడుగుతున్నానని దివి తెలిపింది. ఇక ఈ సినిమాలో తనకు ఒక్క ఛాన్స్ రావాలని కోరుకుంటున్నట్లు కూడా స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ.