Mahira Sharma : ప్రముఖ భారత క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ (Mohanned Siraj) బిగ్ బాస్ బ్యూటీతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హైదరాబాద్ ప్లేయర్ హిందీ బిగ్ బాస్ (Bigg Boss) ఫేమ్ మహీరా శర్మ (Mahira Sharma)తో డేటింగ్ లో ఉన్నాడంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై మహిరా స్పందిస్తూ, తమ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో క్లారిటీ ఇచ్చింది.
రూమర్స్ పై స్పందించిన మహిరా
మహీరా శర్మ చేసిన పోస్ట్ కు ఇంస్టాగ్రామ్ లో సిరాజ్ లైక్ కొట్టడంతో పాటు ఫాలో కావడం వంటివి చేయడంతో… వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అనే పుకార్లకు బలం చేకూరినట్టుగా అయింది. అప్పటి నుంచి ఈ జంట ప్రేమలో ఉన్నారు అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ టైం మహిరా సిరాజ్ తో డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె తమ మధ్య అసలు ఏం లేదని క్లారిటీ ఇచ్చింది.
మహీరా శర్మ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు. నేను ఎవరితో డేటింగ్ లో లేను. అభిమానులు ఎవరితో అయినా సంబంధాలను పెట్టగలుగుతారు. నేను వర్క్ చేసిన సహనటులతో కూడా ఇలాంటి సంబంధాల్ని అంటగట్టారు. కానీ నేను అసలు వాటిని పెద్దగా పట్టించుకోను” అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.
మహీరా శర్మ తల్లి రియాక్షన్
ఇక సిరాజ్ తో మహీరా శర్మ డేట్ చేస్తుందనే వార్తలపై ఇప్పటికే ఆమె తల్లి క్లారిటీ ఇచ్చింది. మహీరా శర్మ తల్లి సానియా శర్మ మాట్లాడుతూ తన కూతురు ఒక సెలబ్రిటీ కావడం వల్ల ఎవరితో మాట్లాడినా, ఇలాంటి రూమర్స్ పుడుతూనే ఉంటాయని అన్నారు. అంతేకాకుండా ఆవిడ ఆ రూమర్స్ ని నమ్మొద్దని కోరారు. కాగా మహీరా శర్మ 1977లో జమ్మూలో పుట్టగా, కొన్నాళ్ళ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఈ బ్యూటీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసి, మోడల్ గా కెరీర్ను మొదలు పెట్టింది. హిందీ టీవీ సీరియల్స్ తో పాటు షోలలో కూడా నటిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. నిజానికి ఆమె చిన్న వయసులోనే ‘యారోన్ కా తాషన్’తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. తరువాత నాగిన్, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి పాపులర్ సీరియల్స్ లో కనిపించింది. అయితే బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ 13’ తర్వాత ఈ అమ్మడి ఫేమ్ ఒక్కసారిగా మారిపోయింది. దాంతో బుల్లితెర నుంచి వెబ్ సిరీస్ లలో ఛాన్సులు రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆమె సిరాజ్ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు రూమర్లపై పెదవి విప్పి, అవన్నీ ఫేక్ వార్తలని కొట్టి పారేసింది మహీరా.