BigTV English

Blood Donor Dies : 24 లక్షల మంది శిశువుల ప్రాణాలు కాపాడిన ఆ పెద్దాయన ఇక లేరు

Blood Donor Dies : 24 లక్షల మంది శిశువుల ప్రాణాలు కాపాడిన ఆ పెద్దాయన ఇక లేరు

Blood Donor Dies : తన జీవితంలో చిన్నారుల కోసం ఎన్నోసార్లు రక్తదానం చేయడం ద్వారా “మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్” గా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా రక్తదాత జేమ్స్ హారిసన్ OAM 88 సంవత్సరాల వయసులో మరణించారు.
ఆస్ట్రేలియాలోని NSW సెంట్రల్ కోస్ట్‌లోని పెనిన్సులా విలేజ్ నర్సింగ్ హోమ్‌లో ఆయన ప్రశాంతంగా మరణించారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్‌క్రాస్ లైఫ్‌బ్లడ్ సంస్థ ధృవీకరించింది. ఈయన సేవలకు ప్రపంచ సంస్థల నుంచి ఎన్నో ప్రసంశలు అందుకున్నారు. చిన్నారుల ప్రాణాల్ని కాపాడేందుకు స్వచ్ఛమైన మనసుతో స్పందించే ఈ వ్యక్తిని గోల్డ్ ఆర్మ్ గా మాత్రమే కాదు.. ఇతనిది గోల్డెన్ హార్డ్ అంటూ అతని ద్వారా సహాయం పొందిన తల్లులు నివాళులు అర్పిస్తున్నారు.


హారిసన్ ప్లాస్మాలో యాంటీ-డి అనే అరుదైన యాంటీబాడీ ఉంది. ఇది ప్రసవ సమయంలో తల్లుల నుంచి వారి బిడ్డలకు ప్రాణాంతకమైన యాంటీబాడీలు వ్యాపించకుండా నిరోధిస్తుంది. హారిసన్ జీవితాంతం అనేకసార్లు రక్తదానాలు చేశారు. ఈ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు. హారిసన్ 1954లో కేవలం 18 సంవత్సరాల వయసులో మొదటి సారి రక్తదానం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి 2018లో 81 సంవత్సరాల వయసు వరకు ఏకంగా 1,173 సార్లు రక్తదానం చేశారు. ఆ తర్వాత ఆయన వయస్సు కారణంగా.. వైద్యుల సూచనలతో రక్త దానాలు ఆపేశారు. కాగా.. ఈ కాలంలో ఆయన రక్తం నుంచి సేకరించిన ప్లాస్మా కారణంగా అంతర్జాతీయంగా 24 లక్షల మందికి పైగా శిశువులకు ప్రయోజనం కలిగింది. ఈ కారణంగానే.. హారిసన్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

హారిసన్ అద్భుతమైన దాతృత్వానికి ఎంతో మంది ప్రశంసలు దక్కాయి. ఆయన సేవల్ని చాలా మంది పొగడ్తలతో నింపేస్తే, మరికొంత మంది ఆయన బాటలో ముందుకు వెళ్లి.. ఆయన ఆలోచనను ప్రేరణగా తీసుకున్నారు. జేమ్స్ అద్భుతమైన, దయగల, ఉదారమైన వ్యక్తి అంటూ.. ఇతని నుంచి ప్లాస్మా సాయం పొందిన తల్లులు కృతజ్ఞతలు తెలుపుతుంటారు. యువకుడిగా ఉన్నప్పుడే తన భార్య బార్బరాను కోల్పోయిన హారిసన్.. ఇతరుల చిన్నారుల్ని కాపాడేందుకు మనస్పూర్తిగా పని చేశారు. తన జీవితంలో క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇతరులకు సహాయం చేయడంలోనూ అంకితభావాన్ని చూపించే వారంటూ వైద్యులు సైతం ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా, ఎలాంటి సందర్భంలోనైనా హారిసన్.. పదిహేను రోజులకు ఓసారి రెడ్‌క్రాస్‌కు వెళ్లి రక్తందానం, ప్లాస్మాను దానం చేసేవారు..


యాంటీ – డీ (Anti-D) అంటే ఏంటి.?

ఇది రక్తంలో ఉండే ప్రత్యేకమైన యాంటీబాడీ. దీనిని హేమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది న్యూ బోర్న్ (HND) వ్యాధీలో చికిత్సకు ఉపయోగిస్తారు. అంటే.. ఇది Rh-నెగటివ్ రక్తం ఉన్న గర్భిణీ స్త్రీలకు Rh-పాజిటివ్ రక్తంతో పిండం ఏర్పాడితే ఆమె శరీరం, కడుపులోని శిశువు ఎర్ర రక్త కణాలను అన్వేషించి వాటిని శత్రువుగా భావించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. ఈ యాంటీబాడీలు భవిష్యత్తు గర్భధారణలో శిశువు రక్త కణాలను నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన అనారోగ్యానికి, కొన్నిసార్లు శిశువు మరణానికి కారణం అయ్యే అవకాశాలుంటాయి. అందుకే అలాంటి వాళ్లకు యాంటీ-డి ఇంజెక్షన్ (Rhogam) ఇస్తారు. ఇందులో.. Rh-నెగటివ్ గర్భిణీ స్త్రీలకు 28వ గర్భధారణ వారంలో, డెలివరీ తర్వాత ఈ ఇంజెక్షన్ ను ఇస్తుంటారు.

Also Read : Military Aid: ఉక్రెయిన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం..

దాంతో.. తల్లి ఇమ్యూన్ సిస్టమ్ శిశువు Rh-పాజిటివ్ రక్తాన్ని గుర్తించకుండా నిరోధిస్తుంది. దాంతో.. చిన్నారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. అయితే.. యాంటీ-డి యాంటీబాడీ అత్యంత అరుదుగా ఉంటుంది. అది ప్రత్యేకంగా Rh-నెగటివ్ దాతల నుంచి మాత్రమే పొందగలం. ఇది రక్త దానం ద్వారా మాత్రమే సేకరించగలిగే విలువైన యాంటీబాడీ, కాబట్టి Rh-నెగటివ్ వ్యక్తుల రక్తదానం చాలా ముఖ్యం.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×