BigTV English

Samantha: ఆ సినిమాలు ఎందుకు చేశానా అని ఫీల్ అవుతున్నా.. సమంత కామెంట్స్

Samantha: ఆ సినిమాలు ఎందుకు చేశానా అని ఫీల్ అవుతున్నా.. సమంత కామెంట్స్

Samantha: మామూలుగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంది అంటుంటారు. కానీ ఈరోజుల్లో హీరోయిన్లు మాత్రం హీరోలకు పోటీ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఎన్నేళ్లయినా తమకు కూడా క్రేజ్ తగ్గదని ప్రూవ్ చేస్తున్నారు. అలాంటి హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సమంత హీరోయిన్‌గా పరిచయమయ్యి 15 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో తన కెరీర్‌ను మొత్తం ఒక్కసారిగా రివైండ్ చేసుకొని జ్ఞాపకాలను అందరితో పంచుకుంది సామ్.


తోడు లేరు

‘‘15 ఏళ్లు అనేది చాలా పెద్ద విషయం. నేను చాలా దూరం వచ్చాను. నేను నటించిన కొన్ని సినిమాలను చూస్తుంటే ఇదేంటి ఇంత దారుణంగా యాక్ట్ చేశాను అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాగే నేను నేర్చుకున్నాను. నాకు నేర్పించేవాళ్లు ఎవరూ లేరు. అప్పట్లో భాష కూడా తెలిసేది కాదు. నేను జీరో నుండి నేర్చుకోవడం మొదలుపెట్టాను. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, కనెక్షన్స్, బంధువులు అస్సలు ఎవరూ లేరు. నాకు అంతా కొత్తే. అలాగే మొత్తం నేర్చుకున్నాను’’ అని తన జర్నీ విషయంలో తాను గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది సమంత (Samantha).


దారుణమైన యాక్టింగ్

‘‘నేను ఇష్టం లేకుండానే ఎంచుకొని నటించిన పాత్రలు చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. మొదట్లో నేను పలు గ్లామర్ పాత్రల్లో నటించాను. అవి నాకు సెట్ అయ్యేవి కాదు. కానీ నేను నా కో యాక్టర్లలాగా ఇండస్ట్రీలో లీనమయిపోవడానికి ప్రయత్నించాను. వేరే వారిలాగా కనిపించడానికి ప్రయత్నించాను, నటించడానికి ప్రయత్నించాను, డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాను. ఆ పర్ఫార్మెన్స్‌లు ఇప్పుడు చూస్తే దారుణంగా అనిపిస్తుంది’’ అని ఓపెన్‌గా చెప్పేసింది సామ్. ‘‘వేరే పాత్రలో లీనమయిపోయి వేరే వారిలాగా నటించడం అద్భుతం. కానీ నాకు ఇప్పుడు అలాంటి పాత్రలు రావడం లేదు కాబట్టి నిర్మాణంలో అడుగుపెట్టాను’’ అని తెలిపింది.

Also Read: కాపాడాల్సిన భర్తే అంత దారుణానికి పాల్పడ్డారా.. కరిష్మా ఎమోషనల్..!

పాఠాలు నేర్చుకున్నా

‘‘నా మొదటి చిత్రం మాస్కోవిన్ కావేరి. అందులో నేను రాహుల్ రవీంద్రన్‌తో నటించాను. తను నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఆ సినిమా షూటింగ్ గురించి నాకేమీ గుర్తులేదు. ఎందుకంటే అది ఒకరోజు షూట్ చేస్తే చాలారోజులు గ్యాప్ వచ్చేది. కానీ ఏమాయ చేశావే అలా కాదు.. ప్రతీ షాట్ నాకు గుర్తుంది. గేట్ దగ్గర కార్తిక్‌ను కలిసే సీన్‌ను మేము మొదటిగా షూట్ చేశాం. గౌతమ్ మీనన్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. గత 15 ఏళ్లు నాకొక పాఠంలాగా చాలా విషయాలు నేర్పించాయి. అందుకే రానున్న 15 ఏళ్లకోసం నేను సిద్ధంగా ఉన్నాను. నేను నేర్చుకున్నదంతా ఇప్పుడు ఉపయోగిస్తాను’’ అని తెలిపింది సమంత.

దానిపైనే ఆధారపడ్డాను

‘‘ప్రస్తుతం నేను ఒకేసారి చాలా పనులు చూసుకుంటున్నాను. అయినా ఒత్తిడి అనిపించడం లేదు. ఒకప్పుడు యాక్టింగ్ మాత్రమే చేసినా ఒత్తిడి అనిపించేది. ఎందుకంటే ప్రతీ సినిమా సక్సెస్ నా విలువను నిర్ణయిస్తుంది అనుకునేదాన్ని. కానీ సక్సెస్ అనేది నా కంట్రోల్‌లో ఉండదు. బాక్సాఫీస్ నెంబర్లపై నా కాన్పిడెన్స్ ఆధారపడి ఉండేది. అలా ఆధారపడడం వల్లే డిశాస్టర్లు ఎదురయ్యాయి. ఇప్పుడు నా ఆలోచనా విధానం మారింది. ఇప్పుడు నాకు నచ్చిందే చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాను’’ అని బయటపెట్టింది సమంత.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×