Shobha Shetty:ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ గా పేరు సొంతం చేసుకున్న శోభా శెట్టి (Shobha Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన వాక్చాతుర్యంతో, అందంతో భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్ గా, నెంబర్ వన్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించిన ‘కార్తీకదీపం’ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ లో నటించి అందరిని అబ్బురపరిచింది. అదే క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ తన రియల్ విలనిజం చూపించి భయపెట్టేసింది. ఇకపోతే ఇక్కడ వచ్చిన క్రేజ్ తో కన్నడ బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టింది. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేక హోస్ట్ కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ను ప్రాధేయపడి మరీ హౌస్ నుండి బయటకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో అటు సీరియల్స్ లో కూడా అవకాశాలు లేక.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న శోభా శెట్టి.. తాజాగా సోషల్ మీడియా ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చింది. కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే శోభా శెట్టి ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకి దూరం కావడం ఏంటి? అంటూ అటు ఫాలోవర్స్ ఇటు అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి శోభా శెట్టి సోషల్ మీడియాకి బ్రేక్ తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వడం వెనుక అసలు కారణం..
ఇకపోతే ఇన్ని రోజులూ సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫోటోలతో పాటు ఇటు సాంప్రదాయంగా కూడా కనిపించి అందరినీ ఆకట్టుకున్న శోభా శెట్టి.. ఇలా సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వడంతో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మడికి అవకాశాలు రావట్లేదు. పైగా ‘కార్తీకదీపం 2’ సీరియల్ లో మళ్లీ అవకాశం వస్తుంది అనుకున్నారు కానీ అవకాశం కూడా చేజారిపోయింది. మరొకవైపు పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే.. ఎంగేజ్మెంట్ అయ్యి ఏడాది అయింది..ఇటీవలే వన్ ఇయర్ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక బట్టల వ్యాపారం మొదలుపెట్టినట్లు వార్తలు వినిపించాయి. కానీ అది కూడా పెద్దగా సాఫీగా సాగుతున్నట్లు అనిపించడం లేదు. ఇలాంటి పలు కారణాలవల్లే ఇప్పుడు ఈమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
also read:Samantha: సొంత అభిమానులనే మోసం చేస్తున్న సమంత.. ఛీ ఛీ డబ్బుల కోసం ఇంత నీచమా ?
మళ్లీ కం బ్యాక్ అవుతుందా?
ఇలా వరుసగా అనుకున్నవేవీ సాధించకపోవడంతో కాస్త నిరాశ వ్యక్తం చేసిన ఈమె అందుకే కాస్త గ్యాప్ తీసుకోవడానికి ఇటు సోషల్ మీడియాకి కూడా దూరమైనట్లు తెలుస్తోంది. మరి ఇలా సడన్గా బ్రేక్ చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి శోభ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.