Karnataka CM: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 18 సంవత్సరాల నిరీక్షణలో… మొట్టమొదటిసారి టైటిల్ కొట్టిన జట్టుగా రికార్డు లోకి ఎక్కింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో దేశవ్యాప్తంగా… బెంగళూరు జట్టును ప్రసంశిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే
బెంగళూరు అభిమానులకు శుభవార్త
టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం అదిరిపోయే ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పర్యట నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం. మొదట ట్రాఫిక్ వల్ల పరేడ్ కు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పిన పోలీసులు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంపర్ ఆఫర్ ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు అలాగే ప్లేయర్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. విధాన సౌధ లో… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ప్లేయర్లు అందరికీ సన్మానం చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.
బెంగళూరు గడ్డపై అడుగు పెట్టిన కోహ్లీ సేన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు.. కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకున్నారు. వేలాది మంది అభిమానుల నడుమ ప్లేయర్లందరూ బస్సులో ర్యాలీగా చిన్న స్వామి స్టేడియానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనుష్క శర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ
KARNATAKA DEPUTY CM RECEIVING RCB PLAYERS. 💥pic.twitter.com/X4eVCaGeWf
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
?utm_source=ig_web_copy_link