RCB Kohli Gavaskar| అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించి 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్లు ఒక తప్పిదం చేశారని.. భారత్ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తొలుత పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) టాస్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆర్సీబీకి బౌండరీలు సులభంగా రాకపోవడంతో, విరాట్ కోహ్లీ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును క్రమంగా కదిలిస్తూ ఆడాడు. 12వ ఓవర్‌లో లాంగ్-ఆన్ వైపు బంతిని నెట్టిన తర్వాత, కోహ్లీ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అతని భాగస్వామి లియామ్ లివింగ్‌స్టోన్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో డైవ్ చేసి సురక్షితంగా చేరాడు.
అయితే, మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. కోహ్లీ పిచ్ మధ్యలో కాళ్లు రాసుకుంటూ నడిచాడని ఎత్తి చూపాడు. ఇది మైదానాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని.. కానీ అంపైర్లు దాన్ని ఎలా అమోదించారని ప్రశ్నించాడు. “కోహ్లీ వేగంగా పరుగులు తీస్తాడు. బంతిని కొట్టిన వెంటనే అతనికి రెండు పరుగులు వస్తాయని తెలుసు. కానీ అతను పిచ్ మధ్యలో నడుచుకుంటూ వెళ్లాడు. పంజాబ్ కింగ్స్ రెండో బ్యాటింగ్ చేయబోతోంది. వారు బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ దెబ్బతిని ఉంటే సమస్యగా మారుతుంది.
అంపైర్లు దీనిపై జోక్యం చేసుకోలేదు, కానీ కోహ్లీ చర్యలపై మాత్రం చర్చ జరిగింది. స్టార్ ఆటగాళ్లకు ఇలాంటి తప్పిదాలు చేసినా వారితో అంపైర్లు సమత్తిస్తారని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానం కూడా వివాదాస్పదమైంది. ఈ సీజన్‌లో అతని స్ట్రైక్ రేట్ యవరేజ్ 150 ఉండగా, ఫైనల్‌లో మాత్రం కొహ్లీ చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ఆడాడు. పెద్ద షాట్లకు ప్రయత్నించే బదులు.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్ వంటి పవర్-హిట్టర్లకు ఎక్కువ సార్లు స్ట్రైక్ ఇవ్వడంపై దృష్టి పెట్టాడు. ఇంగ్లీష్ కామేంటేటర్ మాథ్యూ హేడెన్ దీన్ని ప్రశ్నించాడు. “ఇక్కడ 200 పరుగులు సాధారణ స్కోరు మాత్రమే. కోహ్లీ మరింత దూకుడుగా ఆడాల్సింది,” అని అన్నాడు.
Also Read: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడలేను.. ఐపిఎల్ రిటైర్మెంట్‌పై స్పందించిన కొహ్లీ
35 బంతుల్లో 43 పరుగులు చేసిన కోహ్లీ 15వ ఓవర్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొదటి స్ట్రాటజిక్ టైమ్-అవుట్ సమయంలో ఆర్‌సీబీ కోచ్‌లు ఆండీ ఫ్లవర్, దినేష్ కార్తీక్ కోహ్లీతో సీరియస్ మాట్లాడినట్లు అనిపించింది. బహుశా స్కోరింగ్ రేట్‌ను పెంచమని సూచించి ఉంటారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఐపిఎల్ ఫైనల్ లో ఆర్సీబీ కేవలం 6 పరుగుల తేడాలతో గెలుపొందింది.