BigTV English

Sri Satya: రామ్ నన్ను బ్లాక్ చేశాడు… బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన

Sri Satya: రామ్ నన్ను బ్లాక్ చేశాడు… బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన

Sri Satya: బుల్లితెర నటి శ్రీ సత్య బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యారు. నిన్నే పెళ్ళాడుతా, అత్తారింట్లో అక్క చెల్లెలు, త్రినయిని సీరియల్స్ లో నటించి మెప్పించారు. సీరియల్స్ లో కన్నా బిగ్ బాస్ శ్రీ సత్య అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. బిగ్ బాస్ తో ఈ అమ్మడు బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత శ్రీసత్యకి సోషల్ మీడియాలో ఫాలో అవర్స్ పెరిగారు. అయితే ఈ అమ్మడు ఒకవైపు సీరియస్ లో మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ ని అలరిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక స్టార్ హీరోకు మెసేజ్ చేస్తే, అతను ఈమె నెంబర్ బ్లాక్ చేశాడు. ఆ హీరో ఎవరు ? అసలు ఈమె ఏం మెసేజ్ చేసిందో ఇప్పుడు చూద్దాం..


ఆ హీరో అంటే అంత ఇష్టమా ..

శ్రీ సత్య మొదట మోడల్ గా తన కెరీర్ని ప్రారంభించి తెలుగు సీరియల్స్ లో, సినిమాల్లో నటిస్తున్నారు. 2022 బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాల్గొని అభిమానులకు దగ్గరయింది. శ్రీ సత్య హీరో రామ్ పోతినేనితో ఒక సినిమాలో నటించారు. నేను శైలజ అనే సినిమాలో, ఓ చిన్న క్యారెక్టర్ లో శ్రీ సత్య నటించారు. రామ్ అంటే శ్రీ సత్య కి చాలా ఇష్టం. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను రామ్ పోతినేని కి ఐ లవ్ యు అని టెక్స్ట్ మెసేజ్ చేశాను. ఆయన వెంటనే నా నెంబర్ ని బ్లాక్ చేశాడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఐ లవ్ యు అని మెసేజ్ చేశాను. కానీ రామ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు. టీనేజ్లో ఆయన మీద ఉండే ఇష్టంతో అలా చేశాను అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ సత్య తెలిపింది. శ్రీ సత్య కెరియర్ హీరో రామ్ తో పనిచేయడం చాలా హ్యాపీ అని చెప్పింది.


కెరియర్ పరంగా ..

శ్రీ సత్య సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. ఇప్పటికే చాలామందికి బిగ్బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆఫర్స్ బాగా వస్తాయని అనుకుంటారు. శ్రీ సత్య కూడా అలానే భావించింది. కానీ ఈ అమ్మడుకు ఊహించినంత స్థాయిలో ఆమెకు ఆఫర్స్ ఏం రాలేదు. 2016లో మిస్ ఫోటో జెనిక్ టైటిల్ ని గెలుచుకుంది. 2016 లో నేను శైలజ సినిమాలో నటించింది. ఆ తరువాత గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్, తరుణం వంటి షార్ట్ ఫిలిమ్స్ లోను నటించి మెప్పించింది. నిన్నే పెళ్లాడుతా, ముద్దమందారం సీరియల్స్ ద్వారా పాపులారిటీ పొందింది. తొందర పడకు సుందరవదన సీజన్ ఒకటి, రెండు వెబ్ సిరీస్ భాగాలలో నటించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తోంది.

Game Changer on TV : టీవీల్లోకి వచ్చేస్తున్న రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ… ఎప్పుడు..? ఎక్కడ అంటే..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×