Biggboss Adi Reddy: సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. ముఖ్యంగా బిగ్ బాస్ కు ఎలాంటి వారు వస్తున్నారో చెప్పడం చాలా కష్టం. బిగ్ బాస్ రివ్యూలతో ఫేమస్ అయిన ఆదిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లో ఏం జరిగింది.. ? ఎవరు రియల్ గా ఆడుతున్నారు.. ? ఎవరు ఫేక్.. ? ఎవరు నటిస్తున్నారు.. ? ఇలాంటవన్నీ అనలైజ్ చేసి యూట్యూబ్ లో వీడియోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపే అతనిని బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా మార్చింది. హౌస్ లో కూడా రివ్యూలు ఇచ్చినట్లే అందరి క్యారెక్టర్స్ గురించి మాట్లాడి.. వివాదాలను కొనితెచ్చుకొని బయటకు వచ్చాడు.
ఇక బయటకు వచ్చిన తరువాత ఒకపక్క షోస్ తో ఇంకోపక్క యూట్యూబ్ వీడియోస్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ తరువాత ఆ స్థానంలో వచ్చిన షోస్ ఇస్మార్ట్ జోడీ. రీల్ జోడీలను షోకు పిలిచి వారితో ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఓంకార్ అన్నయ్య. ఇప్పటికే ఇస్మార్ట్ జోడీ రెండు సీజన్స్ మంచి విజయాన్ని అందుకుంది. బిగ్ బాస్ సీజన్ 8 పూర్తీ అయిన దగ్గర నుంచి ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 మొదలయ్యింది.
Anchor Suma: అమ్మ బాబోయ్.. కేరళలో రూ.278 కోట్లతో ఇల్లు కట్టిన సుమ.. ?
ఈ షోలో సీరియల్, యూట్యూబ్ స్టార్స్ తమ భార్యలతో కలిసి పాల్గొన్నారు. అందులో ఆదిరెడ్డి కూడా ఒకరు. తన భార్య కవితతో కలిసి ఈ షోలో పాల్గొంటున్నాడు ఆదిరెడ్డి. ప్రతివారం ఒక్కో థీమ్ తో వచ్చే ఓంకార్ ఈసారి అమ్మ సెంటిమెట్ తో వచ్చాడు. ఇక అమ్మలు గోరుముద్దలు మనకు తినిపించారు.. వారికి ఎప్పుడైనా మీరు గోరుముద్దలు తినిపించారా.. ? అని ప్రశ్నించాడు.
ఇక తల్లులు ఉన్నవారు సమాధానాలు చెప్పుకొచ్చారు. కానీ, ఆదిరెడ్డి తల్లి మరణించారు. ఆమె మరణాన్ని తలుచుకొని ఆదిరెడ్డి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆమె ఎలా మరణించిందో స్టేజిపైన చెప్పుకొచ్చాడు.” సడెన్ గా మా ఫ్రెండ్ తన ఇంట్లో నుంచి పప్పుతో అన్నం తింటూ వాడు బయటకు వచ్చాడు. అరేయ్ మీ ఇంటికి వెళ్దాం రా అని బండి ఎక్కించుకున్నాడు. అప్పుడు కూడా నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఇంటికి వెళ్లి చూసేసరికి మా అమ్మ శవాన్ని.. శవం అని కూడా తెలియదు. ఆమె గుండెల మీద ఇద్దరు ముగ్గురు చేతులతో కొడుతున్నారు. నాకేం అర్ధం కాలేదు.
ఏదో అయ్యిందేమో.. స్పృహ తప్పి పడిపోయిందేమోలే.. గుండెల మీద వత్తుతున్నారు కదా ఏం కాదులే అనుకున్నాను. మా అమ్మ నేను అన్నం పెట్టిన తరువాత స్నానానికి వెళ్లి ఉరేసుకొని చచ్చిపోయింది. అందరూ నన్ను నీకు ఇష్టం వచ్చినట్లు అప్పులున్నాయి.. హెచ్చులు ఎక్కువ అంటే.. మా అమ్మను కారులో తిప్పుతా అనేవాడిని. ఇప్పుడు మా అమ్మ లేదు” అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.