BigTV English

Ind Women vs Ire Women: 304 పరుగుల తేడాతో టీమిండియా విజయం… సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ !

Ind Women vs Ire Women: 304 పరుగుల తేడాతో టీమిండియా విజయం… సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ !

Ind Women vs Ire Women: పురుషుల్లో టీమ్ ఇండియా జట్టు  దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో మహిళల టీమిండియా జట్టు ( India women’s team ) మాత్రం అద్భుత విజయాలతో దూసుకు వెళ్తోంది. బీసీసీఐకి కాస్త రిలీఫ్ ఇచ్చింది టీమిండియా మహిళల జట్టు. తాజాగా టీమిండియా మహిళల జట్టు వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ నిర్వహించింది ఐసిసి. అయితే ఈ టోర్నమెంట్ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా.


Also Read: Smriti Mandhana: సెంచరీతో దుమ్ములేపిన స్మృతి.. ఆసియాలోనే తొలి క్రికెటర్‌గా రికార్డు !

ఇవాళ జరిగిన రాజ్కోట్ వన్డేలో… టీమిండియా హైయెస్ట్ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ జట్టుపై ఏకంగా 304 పరుగుల తేడాతో మహిళల టీమిండియా జట్టు  ( India women’s team ) విజయం సాధించి సిరీస్ గెలుచుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన టీమిండియా మహిళల జట్టు 435 పరుగులు చేసింది.


టీమిండియా మహిళల జట్టులో ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. ప్రతికా రావల్ ( Pratika Rawal ) ఏకంగా 154 పరుగులు చేసి దుమ్ము లేపింది. 129 బంతుల్లో 154 పరుగులు చేసింది ఓపెనర్. ఇందులో ఒక సిక్స్ ఉండగా 20 బౌండరీలు ఉన్నాయి. 119 స్ట్రైక్ రేట్ తో ఈమె… టీమిండియా కు భారీ స్కోర్ అందించింది. ఇక ఈ సిరీస్ కు కెప్టెన్ గా ఉన్న స్మృతి మందాన ( Smriti Mandana ) కూడా 135 పరుగులతో దుమ్ము లేపింది.

కేవలం 80 బంతుల్లోనే 135 పరుగులు చేసి రఫ్ఫాడించింది మందాన. ఇందులో ఏడు సిక్సులు 12 బౌండరీలు ఉన్నాయి. 168 స్ట్రైక్ రేట్తో స్మృతి మందాన టాప్ లేపేసింది. ఇక ఈ ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత… రిచా ఘోష్ వికెట్ కీపర్ గా బరిలోకి దిగి… బ్యాటింగ్ లోను అదరగొట్టింది. 59 పరుగులు చేసి టీమిండియా 435 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఘోష్.

Also Read: Virat Anushka New Home: విరాట్‌ కోహ్లీ ఇంట శుభకార్యం.. గ్రాండ్‌ గా ఏర్పాట్లు !

అయితే 435 పరుగులను ఛేదించే క్రమంలో ఐర్లాండ్ విఫలమైంది. 31.4 ఓవర్లు ఆడిన ఐర్లాండ్ ఉమెన్స్ జట్టు ( Ireland  women’s team )) కేవలం 131 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 304 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్లు గెలిచిన టీమిండియా మహిళల జట్టు ( India women’s team )… మూడవ మ్యాచ్ గెలిచి…3-0 సిరీస్ ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన… ప్రతికా రావల్ ( Pratika Rawal ) కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. ఇది ఇలా ఉండగా… ప్రతికా రావల్ ( Pratika Rawal ) ఢిల్లీకి చెందిన క్రికెటర్. ఆమె దేశీయ క్రికెట్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చింది. ప్రతికా రావల్ ( Pratika Rawal ) తండ్రి బిసిసిఐ లెవెల్ 2 అంపైర్. అతని పేరు ప్రదీప్ రావల్. తన కూతురిని ఎలాగైనా క్రికెటర్ చేయాలని… ప్రదీప్ రావల్ కష్టపడి ఈ స్థాయికి తీసుకువచ్చాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×