BigTV English

Odela 2 Story : ఓదెల 2 స్టోరీ ఇదే… బిగ్ టీవీ ముందే చెప్పింది

Odela 2 Story : ఓదెల 2 స్టోరీ ఇదే… బిగ్ టీవీ ముందే చెప్పింది

Odela 2 Story..సంపత్ నంది (Sampath Nandi) స్టోరీ అందించగా.. అశోక్ తేజ (Ashok Teja) డైరెక్షన్ లో 2022లో విడుదలైన చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’. ఇప్పుడు మూడేళ్ల నిర్విరామ కష్టం తర్వాత ఈ సినిమా సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2)ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) ఇందులో తొలిసారి నాగసాధ్విగా కనిపించబోతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు సంపత్ నంది కూడా ఈసారి చాలా పగడ్బందీగా స్టోరీ రాసుకున్నారు. దానిని అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ అశోక్ తేజ సక్సెస్ అయినట్టు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనిని ముందే బిగ్ టీవీ చెప్పేసింది. గత రెండు నెలల క్రితమే ఇందులో.. ఓదెలా 2 స్టోరీ లీక్ అంటూ కథనాన్ని ప్రచురించగా.. ఇప్పుడు అదే స్టోరీ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో కూడా ఉండడంతో.. నెటిజెన్స్, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వారు చెప్పిందే నిజమైంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


ఓదెల 2 స్టోరీ లీక్..

ఇక అసలు విషయంలోకి వెళితే.. “ఓదెల రైల్వే స్టేషన్ సినిమా క్లైమాక్స్ లో రాధ(హెబ్బా పటేల్).. తన భర్త తిరుపతి (వశిష్ట ఎన్ సింహ) తల నరికి, ఆ తలను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. అక్కడితో ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా అయిపోతుంది. ఇప్పుడు ఆ సినిమాకి కంటిన్యూస్ గా ‘ఓదెలా 2’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో భార్య చేతిలో చనిపోయిన తిరుపతి, ఈ ఓదెల 2 సినిమాలో ప్రేతాత్మగా మారుతాడు. ముందుగా తనను చంపిన భార్య రాధాపై పగ సాధించి, ఆ తర్వాత తనకున్న కామ కోరికలను కూడా తీర్చుకుంటారు. ముఖ్యంగా ఆ ఊరిలో ఉండే అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తూ, ఊరిని స్మశానంగా మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రాధా పాత్ర కూడా చనిపోతుంది. దీంతో తిరుపతి దెయ్యం నుండి ఊరిని ఎవరు కాపాడుతారు ? అని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉండగా.. రాధా అక్క శివశక్తి (తమన్నా) రంగంలోకి దిగుతుంది.ఇక శివ శక్తికి.. ఆ ఊరికి ఉన్న బంధం ఏమిటి? అనే విషయానికొస్తే రాధ అక్కే శివ శక్తి. తన చెల్లి రాధా చనిపోయిందనే విషయాన్ని తెలుసుకున్న శివశక్తి.. ఆ ఊరికి వస్తుంది. ఆమె ఒక సాధువు. తన చెల్లిని చంపిన వాడిపై రివేంజ్ తీర్చుకోవాలని , ఆ గ్రామస్తులను ఆ కామాంధుడి నుండి విముక్తి కల్పించాలని శివశక్తి సంకల్పిస్తుంది. చివరిగా తిరుపతి అనే దెయ్యం పై శివశక్తి రివేంజ్ తీర్చుకుంటుంది. అలాగే ఆ ఊరి వాళ్ళకి కూడా ఆ తిరుపతి దెయ్యం నుండి విముక్తి కలిగిస్తుంది.


also read:  Odela 2 Story: దెయ్యం నుంచి ఊరిని కాపాడే కథ… ఓదెల 2 ఫుల్ స్టోరీ లీక్..?

ముందే చెప్పేసిన బిగ్ టీవీ..

మొత్తం ఈ సన్నివేశాలు అన్నింటిని కూడా కళ్ళకు కట్టినట్టు మనకు బిగ్ టీవీ గత రెండు నెలల క్రితమే ప్రచురించింది. ఇప్పుడు ఇదే స్టోరీ మనకు ఓదెల 2 నుండి తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో కూడా చూడవచ్చు. మొత్తానికైతే ‘ఓదెల 2’ విషయంలో బిగ్ టీవీ చెప్పిన జ్యోతిష్యం ఫలించిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×