Lenin Title Glimpse: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా లాంచ్ అయ్యాడు అఖిల్. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తనకు ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పటికే హీరోగా అయిదు సినిమాల్లో నటించినా కూడా అందులో ఒక్కటి కూడా కనీసం యావరేజ్ హిట్ కూడా అవ్వలేదు. అందుకే తన కెరీర్‌లోని 6వ సినిమా కోసం ఎక్కువగా హోమ్ వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు అక్కినేని అఖిల్. అందుకే తన చివరి సినిమా విడుదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతున్నా టైమ్ తీసుకొని తన తరువాతి మూవీని ప్లాన్ చేసుకున్నాడు. సైలెంట్‌గా ఆ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టుకొని తాజాగా టైటిల్ గ్లింప్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్.
గ్లింప్స్ వచ్చేసింది
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) తన కెరీర్‌లోని 6వ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాను డైరెక్ట్ చేశాడు మురళీ కిషోర్. ఆ మూవీ యావరేజ్ హిట్ అయినా కూడా తనను నమ్మి తన వారసుడు అఖిల్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు నాగార్జున. అఖిల్, మురళీ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా మొదలయ్యిందని, దీనికి ‘లెనిన్’ అనే టైటిల్ పెట్టారని చాలాకాలం నుండి ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అదే నిజమయ్యింది. తాజాగా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యింది.
కొత్త పెయిర్
‘‘గతాన్ని తరమడానికి పోతా.. మా నాయన నాకొక మాట సెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా, పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే..’’ అనే డైలాగ్ సగంలో ఆపేసి టైటిల్ గ్లింప్స్‌ను ముగించారు మేకర్స్. మొత్తానికి ఈ సినిమా ప్రేమ గురించి, దానికోసం చేసే పోరాటం గురించి అని ఈ గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక చివర్లో హీరోయిన్ శ్రీలీల అని రివీల్ చేయడంతో ఈ గ్లింప్స్ ఎండ్ అయ్యింది. అఖిల్, శ్రీలీల (Sreeleela) కాంబినేషన్ కాస్త కొత్తగా అనిపించినా వర్కవుట్ అయ్యేలాగానే ఉంది. దీనికోసం అఖిల్ చేసిన హోమ్ వర్క్ గ్లింప్స్‌లోనే క్లియర్‌గా అర్థమవుతుంది.
Also Read: రాజమౌళి తర్వాత నువ్వే గ్రేట్.. ‘పెద్ది’ గ్లింప్స్‌పై ఆర్జీవీ రివ్యూ
గడ్డం పెంచాడు
‘ప్రేమకంటే ఏ యుద్ధం కూడా భయంకరమైనది కాదు’ అనే ట్యాగ్ లైన్‌తో ‘లెనిన్’ (Lenin) సినిమా తెరకెక్కుతోంది. దీనికి తమన్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంటుందని ఈ గ్లింప్స్‌తోనే ప్రేక్షకులకు అర్థమవుతోంది. ఎప్పుడూ చాక్లెట్ బాయ్‌లాగా, లవర్ బాయ్‌లాగా అందంగా కనిపించే అఖిల్.. మొదటిసారి పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘లెనిన్’ కోసం పూర్తిగా గడ్డం పెంచేశాడు. ఇటీవల తన అన్న నాగచైతన్య ఎలా అయితే ‘తండేల్’ సినిమాలో కొత్త యాసతో ప్రయోగం చేశాడో.. అఖిల్ కూడా ‘లెనిన్’తో అదే యాసతో ప్రయోగం చేయడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది.