Bipasha Basu.. ప్రముఖ సింగర్ మికా సింగ్ (Mika Singh) గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి బిపాసా బసు (Bipasha Basu), ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)పై పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ దంపతుల వల్లే తాను ఆర్థికంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో బిపాసా బసు షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండాలంటూ పోస్ట్ ద్వారా తెలియజేయడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. బిపాసా తన పోస్టులో “విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు ఎప్పటికప్పుడు అల్లర్లు సృష్టిస్తారు. తప్పు ఏదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీదే వేస్తారు. ఆ తప్పుకి వారు బాధ్యత మాత్రం వహించరు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ మనం దూరంగా ఉండాలి . ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ తాజాగా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది బిపాసా బసు. అయితే ఇది చూసిన నెటిజెన్స్ సింగర్ మికా సింగ్ వ్యాఖ్యలను తిప్పి కొట్టేందుకే బిపాసా పరోక్షంగా పోస్టు పెట్టి ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలేమైందంటే..?
బిపాసా బసు.. ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ నటించిన “డేంజరస్” వెబ్ సిరీస్ కి సింగర్ మికా సింగ్ నిర్మాతగా వ్యవహరించారు. షూట్ కోసం లండన్ కి వెళ్ళినప్పుడు బిపాసా దంపతులు నాటకాలు ఆడారని , షూటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదని ఆయన ఆరోపించారు. వారి వల్లే రూ .4కోట్ల బడ్జెట్ కాస్త రూ. 14 కోట్లు అయిందని, వారి ప్రవర్తన చూసాక నిర్మాతగా తాను ఎంతో బాధపడ్డానని తెలిపారు . అంతేకాదు..” వాళ్లు నాడు నాకు చేసిన నష్టానికి ఈనాడు ఆ దంపతులకు ఏ పని లేకుండా పోయింది” అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే బిపాసా బసు సింగర్ మికా సింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కామెంట్లు చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయాలపై మికా సింగు ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
బిపాసా బసు కెరియర్..
మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఈమె, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది.ఎక్కువగా తమిళ్, తెలుగు , ఇంగ్లీష్, బెంగాలీ చిత్రాలలో నటించిన ఈమె ఎక్కువగా హిందీ సినిమాలలోనే నటిస్తోంది.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు, సైఫ్ అలీ ఖాన్, జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్, రాంగోపాల్ వర్మ , జయంత్ సి పరాంజి, రోహిత్ శెట్టి, ఆదిత్య చోప్రా, వంటి వారి సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది. గత 15 సంవత్సరాలకి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బిపాసా బసు తన అందంతో, నటనతో భారీ క్రేజ్ దక్కించుకుంది అని చెప్పవచ్చు.