HBD Anushka: కన్నడ బ్యూటీ స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి (Anushka Shetty)ఇండస్ట్రీ లోకి పూరీ జగన్నాథ్ (Puri Jagannath), నాగార్జున (Nagarjuan) కాంబినేషన్లో వచ్చిన ‘సూపర్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఒడ్డు ,పొడవు, అందంతో విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో ‘అరుంధతి’ సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా ఈమెతో సినిమా చేయడానికి భయపడ్డారు అంటే ఏ రీతిలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. అరుంధతి సినిమా తర్వాత వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. అలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
రీ ఎంట్రీ లో వరుస అవకాశాలు..
ఇకపోతే ప్రభాస్ తో ఎక్కువగా నటించిన ఈమె బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుసగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. దీంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే భాగమతి, నిశ్శబ్దం, సైజ్ జీరో వంటి సినిమాలు చేసింది. ఇకపోతే భారీగా బరువు పెరిగిపోయిన అనుష్కకు అవకాశాలు రాలేదు. అలా ‘సాహో ‘ సినిమాలో తొలుత అవకాశం వచ్చినా.. భారీ ఖాయం కారణంగా అవకాశం కోల్పోయింది. దాంతో ఇండస్ట్రీకి దూరం అయిన ఈమె.. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్ళీ రీ యంట్రీ ఇచ్చింది.
ఘాటీ మూవీ నుండి అనుష్క వైల్డ్ లుక్..
ప్రస్తుతం మలయాళం లో ఒక సినిమా చేస్తున్న ఈమె తెలుగులో కూడా డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వంలో మరోసారి ఘాటి (Ghaati) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘ వేదం ‘ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఘాటి అనే మరో కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనుష్క. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి ఆమె వైల్డ్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. పోస్టర్ విషయానికి వస్తే.. “సిగార్ పీలిస్తూ .. ఆగ్రహంతో ముఖం నిండా రక్తంతో ఉన్న ఆమె వైల్డ్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది” . అలాగే ఈ సినిమా నుండి ఈరోజు సాయంత్రం అనుష్క 4:05 గంటలకు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఏది ఏమైనా అనుష్క మూవీ నుండి విడుదల చేసిన పోస్టర్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
అనుష్క వ్యక్తిగత జీవితం..
ఇక అనుష్క వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంది . గతంలో ప్రభాస్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చినా అది కేవలం రూమర్ గానే మిగిలిపోయింది. దీనికి తోడు ఇటీవల వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధం కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నా.. అందులో నిజాలు లేకుండా పోయాయి. మరి అనుష్క ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి అని అభిమానులు సైతం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
VICTIM. CRIMINAL. LEGEND.
The Queen will now rule the #GHAATI ❤🔥
Wishing ‘The Queen’ #AnushkaShetty a very Happy Birthday ✨#GhaatiGlimpse Video today at 4.05 PM ✨
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.#HappyBirthdayAnushkaShetty@DirKrish @UV_Creations… pic.twitter.com/jgZEBPU5gx
— UV Creations (@UV_Creations) November 7, 2024