Law makers fighting: శాసనాలు తయారు చేసే లా మేకర్స్ పట్టు తప్పుతున్నారు. ఆవేశానికి లోనై ఒకరిపై మరొకరు ముష్టి ఘాతాలకు దిగుతున్నారు. ఈ తరహా ఘటనలు అప్పుడప్పుడు థాయ్‌లాండ్, తైపీ వంటి దేశాల్లో జరిగేవి. ఇప్పుడు ఇండియాకు సోకినట్టు కనిపిస్తోంది. లేటెస్ట్‌గా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ గురువారం రణరంగంగా మారింది. అసలేం జరిగింది?
జమ్మూకాశ్మీర్‌లో గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సభ్యులు ఒకొక్కరిగా సభలోకి వస్తున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్దరణపై ఎమ్మెల్యేలు ఫైటింగ్‌కు దిగారు. సభలో జరిగిన తతంగాన్ని చూసి ప్రజలంతా నోళ్లు వెళ్లబెట్టారు.
ఐదేళ్ల కిందట జమ్మూకాశ్మీర్‌కు ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని పునరుద్దరించాలంటూ బుధవారం అసెంబ్లీలో పీడీపీ తీర్మానం ప్రవేశపెట్టింది. దీన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. తీర్మానం పెట్టిన కాపీలను చించివేశారు.
గురువారం సభా కార్యక్రమాలు మొదలుకాగానే ఎంపీ ఇంజనీర్ రషీద్ బ్రదర్.. ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370ని పునరుద్దరించాలంటూ సభలో బ్యానర్‌ని ప్రదర్శించారు. దాన్ని బీజేపీ నేత సునీల్ శర్మ అభ్యంతరం తెలిపారు.
ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి-డిప్యూటీ సీఎం పవన్, మాటల యుద్ధమా?
అక్కడి నుంచి సభలో సభ్యుల మధ్య గందరగోళం మొదలైంది. తొలుత సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ లోగా శాసన కర్తలు ఆవేశానికి లోనయ్యారు. చివరకు ఒకరిపై మరొకరు పంచ్‌లు విసురుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ రంగంలోకి దిగేశారు. దాడులు చేసుకున్న ఎమ్మెల్యేలను విడదీశారు. పలువురు ఎమ్మెల్యేలకు బయటకు పంపారు. సభలో జరిగిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఖుర్షీద్‌కు అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో సభను వాయిదా వేశారు స్పీకర్. అధికార-విపక్ష సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి సభ్యులు శాంతిస్తారా?
Some place don't need election… they need need good governance. i will go for LG rule again after seeing this. #jammukashmir pic.twitter.com/36Mr8hQui1
— कवि: आलोक “अज्ञात” (@alokntyl) November 7, 2024