BigTV English

Lara Dutta: బాలీవుడ్ నటి లారా దత్త ఇంట్లో విషాదం..  పితృశోకంలో నటి!

Lara Dutta: బాలీవుడ్ నటి లారా దత్త ఇంట్లో విషాదం..  పితృశోకంలో నటి!

Lara Dutta: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లారా దత్త (Lara Dutta)ఒకరు. హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లారాదత్త ఇండస్ట్రీలోకి రాకముందే అందాల పోటీలలో పాల్గొంటూ సందడి చేసేవారు. ఇక 2000 సంవత్సరంలో జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీలలో ఈమె కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా మిస్ యూనివర్స్ గా కిరీటాన్ని అందుకున్న తర్వాత లారాదత్తకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈమె 2003 వ సంవత్సరంలో “అందాజ్ “అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు..


వింగ్ కమాండర్ ఎల్.కె. దత్తా…

ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతిని వివాహం చేసుకున్నారు. ఇలా తన ఫ్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్న లారా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఈమె కన్న తండ్రి, వింగ్ కమాండర్ ఎల్.కె. దత్తా కన్నుమూశారు. 84 సంవత్సరాల వయసు ఉన్న ఎల్ .కే దత్తా  మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. మే 12వ తేదీ ఎల్. కే దత్తా తన 84వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇదే రోజు తన కుమార్తె లారా దత్త ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే.


ముంబైలో అంత్యక్రియలు…

గత పాతిక సంవత్సరాల క్రితం మే 12 వ తేదీ ఆమె పుట్టినరోజు వేడుకలతో పాటు, మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే తన తండ్రి పుట్టిన రోజు వేడుకలు జరిపిన కొద్ది రోజులకే తన తండ్రి మరణించడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక నేడు ముంబైలో శాంతాక్రూజ్ హిందూ శ్మశానవాటికలో లారా అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఈయన అంత్యక్రియలను నిర్వహించినట్టు తెలుస్తుంది.21 మంది అధికారులు తుపాకులను గాల్లో పేలుస్తూ ఎల్ .కే దత్తా మృతదేహానికి అంతిమ నివాళులు అర్పించాడు.

?utm_source=ig_web_copy_link

ఎల్ .కే దత్తా అంత్యక్రియలలో భాగంగా లారా దత్త, ఆమె తల్లితో పాటు తన భర్త మహేష్ భూపతి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు లారా తండ్రి మరణానికి సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇక ఈయన మరణానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక లారా దత్త కెరియర్ విషయానికి వస్తే ఈమె కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె నటుడు అక్షయ్ కుమార్ తో కలిసి వెల్ కమ్ టు ది జంగిల్ అనే సినిమాలో నటించబోతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×