PEDDI – Update : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో పెద్ది ఒకటి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలు జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్రయాసలో మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఇదివరకే విడుదలైన పెద్ద షాట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసింది. రామ్ చరణ్ ను బుచ్చిబాబు చూపించిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి.
ఆ నటుడు సీన్స్ కంప్లీట్
పెద్ది సినిమాలో పెద్దపెద్ద నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జగపతిబాబు కు సంబంధించిన సీన్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వి కపూర్, రావు రమేష్ మధ్య కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ది కి సంబంధించిన వీడియో రిలీజ్ అయినప్పుడు చాలామందిని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆశ్చర్యపరిచాడు ఏఆర్ రెహమాన్. రెహమాన్ నుంచి అటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడం చాలా మందికి కొత్తగా అనిపించింది.
Also Read : Narne Nithin – Sangeeth Sobhan: పేరు వచ్చింది కాబట్టి పాత ప్రాజెక్టులు రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు
నెక్స్ట్ లెవెల్ సక్సెస్
బుచ్చిబాబు విషయానికొస్తే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు డైరెక్టర్ గా మారిపోయాడు. వైష్ణవి తేజ్ (Vaishnav Tej) కెరియర్ కి అద్భుతమైన సక్సెస్ అందించాడు. ఉప్పెన సినిమా తర్వాత ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా చేస్తాడని చాలామంది ఊహించారు. అప్పట్లో వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన రామ్ చరణ్ తో సినిమాను మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా మీద కూడా ఇప్పుడు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. రంగస్థలం సినిమా చరణ్ కెరియర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది అని పలు సందర్భాల్లో దర్శకుడు సుకుమార్ తెలిపారు. ఇప్పుడు పెద్దితో ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు అనేది చాలామంది ఎదురుచూస్తున్న విషయం.
Also Read : Shekhar Kammula : ఆయనను టీనేజ్లో చూశాను, ఈయనతో సినిమా తీయాలి అనుకున్నాను