Aman Jaiswal: ఇండస్ట్రీలో మరొక విషాదం చోటుచేసుకుంది. 23 ఏళ్ల యంగ్ యాక్టర్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడనే విషయం ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తోంది. బాలీవుడ్ బుల్లితెర నటుడు అయిన అమన్ జైస్వాల్.. జనవరి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలియగానే తన ఫ్యాన్స్ అంతా తన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్ బుల్లితెరపై సీరియల్స్‌తో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న అమన్.. ఎంతో ఫ్యాన్ బేస్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి అమన్ సడెన్‌గా మన మధ్య లేరు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నామంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
అధికారికంగా ప్రకటన
బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘ధర్తిపుత్ర నందిని’ (Dhartiputra Nandini) సీరియల్ ఫేమ్ అమన్ జైస్వాల్ (Aman Jaiswal).. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బైక్‌పై వెళ్తున్న సమయంలో ఒక ట్రక్ వచ్చి తనను ఢీకొట్టింది. అలా అమన్ అక్కడికక్కడే మృతిచెందాడని సమాచారం. ఈ యాక్సిడెంట్‌ను చూసిన ప్రజలు వెంటనే తనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. జోగేశ్వరిలోని ఆసుపత్రికి తనను తరలించారు. కానీ తను అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అమన్ జైస్వాల్ ఇక లేడు అనే విషయాన్ని ‘ధర్తిపుత్ర నందిని’ నిర్మాత అయిన దీపికా చిఖ్లియా స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా తన ఫ్రెండ్స్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అరగంటకే మృతి
అమన్ జైస్వాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన అభినేషన్ మిశ్రా.. ఈ విషయంగ గురించి చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ‘‘అందరూ కలిసి తనను వెంటనే జోగేశ్వరిలోనే కామా హాస్పిటల్‌కు తరలించినా కూడా తనను కాపాడలేకపోయాం. యాక్సిడెంట్ అయిన అరగంటకే తను మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు’’ అంటూ బాధతో ఈ విషయాన్ని అందరికీ ప్రకటించాడు. 2023 ఆగస్ట్‌లో ‘ధర్తిపుత్ర నందిని’ సీరియస్ ప్రారంభమయ్యింది. కొన్నాళ్లకే ఈ సీరియల్ సూపర్ సక్సెస్‌ను సాధించింది. అలా ఇందులో నటించిన అమన్ జైస్వాల్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. కానీ ఈ సీరియల్ కేవలం ఏడాది పాటు మాత్రమే నడిచింది.
Also Read: ధైర్యంగా ముందడుగు వేశాను, ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను.. పూజా కామెంట్స్
కొత్త కలలు
అమన్ జైస్వాల్ హఠాన్మరణం తర్వాత తను ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 2025 గురించి చాలా ఉత్సాహంతో పోస్ట్ చేశాడు అమన్. ‘‘కొత్త కలలు, అంతులేని అవకాశాలతో 2025లోకి అడుగుపెడుతున్నాను’’ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ షేర్ చేశాడు. ఇది చూసిన తన అభిమానులు మరింత బాధపడుతున్నారు. టీనేజ్‌లో ఉన్నప్పుడే యాక్టర్ అవ్వాలనే కలతో ముంబాయ్‌లో అడుగుపెట్టాడు అమన్ జైస్వాల్. కానీ తను ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాడు. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలను కోల్పోయాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత ‘ధర్తిపుత్ర నందిని’తో తనకు సక్సెస్ లభించింది. అలా తనకు మరెన్నో అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో బిజీ అయిపోతాడని అనుకునే సమయంలోనే యాక్సిడెంట్‌తో తన జీవితం ముగిసింది.