Pooja Hegde: హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్లకు కూడా పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ దక్కుతుంది. దానికోసం వారు పాన్ ఇండియా సినిమాల్లో నటించాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా ప్రతీ భాషలో సినిమాలు చేస్తే చాలు.. ఇప్పుడు ఆ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌ను రష్మిక కొట్టేసింది. కానీ అంతకు ముందు ఈ ట్యాగ్‌కు చాలా చేరువలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. అలాంటిది తను నటించిన సినిమాలు వర్కవుట్ అవ్వకుండా ఫ్లాప్స్ అవుతూ ఉండడంతో పూజా హెగ్డే మెల్లగా వెనకబడింది. అయినా బాలీవుడ్ నుండి పూజా హెగ్డేకు చాలానే ఆఫర్లు వస్తుండగా దానిపై తాజాగా తను స్పందించింది. ఇదంతా తన అదృష్టం అని చెప్పుకొచ్చింది.
అదృష్టంగా భావిస్తున్నాను
ప్రస్తుతం పూజా హెగ్డే.. షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన ‘దేవ’ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్‌గా విడుదలకు సిద్ధమయ్యింది. ఆఖరికి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడానికి కూడా ఎన్నో వాయిదాలు పడింది. మొత్తానికి తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అందులో పూజా హెగ్డే పాల్గొని ఈ సినిమాలో నటించడంపై సంతోషంగా వ్యక్తం చేసింది. అంతే కాకుండా ప్రతీ భాషలో సినిమాలు చేయడంపై తన అభిప్రాయం ఏంటో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే (Pooja Hegde) చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కానీ హిందీ, తమిళంలో కూడా మాత్రం ఆఫర్లు ఆగడం లేదు. ఇదంతా తన లక్ అంటూ కామెంట్స్ చేసింది పూజా.
అదే నమ్ముతాను
‘‘ఈ సమయంలో నా కెరీర్‌లో నేను ఎలాంటి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటానో దాన్ని బట్టి యాక్టర్‌గా నేను ఎవరు అనేది ప్రేక్షకులకు తెలుస్తుందని అర్థం చేసుకున్నాను. అందుకే వర్సటైల్ పాత్రలను ఎంచుకుంటున్నాను. ఇప్పుడు నేను మరొక సినిమా చేస్తున్నాను. అందులో దేవతో పోల్చుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను’’ అని వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకోవడం వెనుక తన అభిప్రాయాన్ని బయటపెట్టింది పూజా హెగ్డే. ‘‘ప్రస్తుతం నేను చాలా భాషల్లో పనిచేస్తున్నాను. కంటెంట్ బాగుంది అంటే నేనే వెతుక్కుంటూ వెళ్లడాన్ని నమ్ముతాను. నేను ధైర్యంతో ముందడుగు వేస్తూ వచ్చాను’’ అని చెప్పుకొచ్చింది.
Also Read: మొదటి భార్య నుండి సైఫ్ ఎందుకు విడిపోయారో తెలుసా..?
అన్ని భాషలు
‘‘నా జర్నీలో ఒక పాన్ ఇండియా సినిమా అనేది మాత్రమే లేదు. నేను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించాను. ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ప్రశంసించారు, ఒప్పుకున్నారు. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. గర్వపడుతున్నాను. ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా కష్టపడాలి అనే ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఒక ముంబాయ్ అమ్మాయిని కానీ తమిళనాడులో నా కెరీర్ ప్రారంభించాను. తెలుగు నుండి ప్రేమ, అభిమానాన్ని పొందాను. కానీ నేను కర్ణాటకకు చెందిన అమ్మాయిని అది కూడా నాకు ప్లస్ అయ్యింది’’ అని తెలిపింది పూజా హెగ్డే. ఇక ఎన్నో వాయిదాల తర్వాత షాహిద్, పూజా నటించిన ‘దేవ’ (Deva) జనవరి 31న విడుదల కానుంది.