Amit Shah IN AP: ఎన్డీయే నేతల మధ్య ఏం జరుగుతోంది? స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ తర్వాత అమిత్ షా ఏపీకి రావడం వెనుక అసలు కథేంటి? కూటమి పక్షాలతో ఆయన భేటీ కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. చాన్నాళ్ల తర్వాత ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు.
శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు కేంద్ర హోంమంత్రి రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో మంతనాలు జరపనున్నారు.
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు? ఇంకా పెండింగ్‌లో ఏయే అంశాలున్నాయి? మోదీ పాలనపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందనే దానిపై షా ఆరా తీయనున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలనేది వీరు చర్చించే అవకాశమున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ఆర్థిక పరిస్థితి, రాజకీయ అంశాలపై ముగ్గురు నేతలు చర్చించనున్నారు. ఆ తర్వాత హోటల్‌లో అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ ఉండనుంది. దీనికి కూటమి నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి కూడా. శనివారం రాత్రికి విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేయనున్నారు.
ALSO READ: అదంతా అబద్దం.. అలా జరగలేదు.. టీటీడీ చైర్మన్ క్లారిటీ
ఆదివారం గన్నవరంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ బెటాలియిన్ భవనాన్ని-NDRF ప్రారంభించనున్నారు హోంమంత్రి అమిత్ షా. దాని తర్వాత NIDM భవనం వంతు కానుంది. అమిత్ షా పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ బీజేపీ. సభతోపాటు షా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు పురందేశ్వరి.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి, సహజంగానే రాష్ట్రానికి కేంద్రమంత్రులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఏపీ అభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలున్నాయని చెప్పుకొచ్చారు.