Bollywood: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు, ఏ వయసులో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పడం అసాధ్యం. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారా అంటే చెప్పలేని పరిస్థితి. దశాబ్దాల పాటు కలిసున్న జంటలు కూడా చిన్నపాటి విభేదాలతో విడిపోయి కొత్త తోడు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ నటుడు 44 ఏళ్ళ వయసులో తన వయసులో సగం.. అంటే 22 ఏళ్ళ వయసున్న అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని 16 సంవత్సరాల పాటు ఆమెతో సంసారం చేసి, చివరికి ఇంకో అమ్మాయి మోజులో పడి మొదటి భార్యకు అన్యాయం చేశారు. అయితే ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసినా.. అతడు మాత్రం కొంతకాలం తనకు ఏమీ పట్టనట్టు తన జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేసి నెటిజన్స్ విమర్శలకు తావు ఇచ్చారు.మరి ఆయన ఎవరు? ఆ భార్య ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
SSMB 29: స్టోరీ లీక్.. డ్రీమ్ ప్రాజెక్టుతో ముడిపెడుతున్న రాజమౌళి..!
44 ఏళ్ళ వయసులో 22 ఏళ్ల అమ్మాయితో పెళ్లి..
ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(Dilip Kumar) అట్రాక్టివ్ నేచర్ తో, నటనతో అభిమానులు ప్రశంసలు అందుకున్న ఈయన.. అప్పట్లో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయనను చూడడానికి అభిమానులు థియేటర్లకు ఎగబడేవారు. అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా పేరు దక్కించుకున్న ఈయన.. బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా కొనసాగి, 22 ఏళ్ల సైరా భాను (Saira Banu) ని 44 ఏళ్ళ వయసులో వివాహం చేసుకొని, అందరిని ఆశ్చర్యపరిచారు. వీరిద్దరి మధ్య వయసులో దాదాపు 22 సంవత్సరాలు తేడా ఉన్నప్పటికీ బంధంలో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండేది కాదట. దీంతో బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా కూడా ఈ జంట పేరు తెచ్చుకుంది.
పదహారేళ్ల బంధం లో బీటలు..
ఇకపోతే పెళ్లి అయ్యాక దాదాపు 16 సంవత్సరాల పాటు సంసార జీవితాన్ని సంతోషంగా గడిపిన ఈ జంట మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చారు. ఆమె ఎవరో కాదు ఆస్మా రెహ్మాన్(AsmaRehman).దిలీప్ కుమార్ హైదరాబాద్ కి చెందిన ఆస్మాను సైరా బానుకు తెలియకుండా వివాహం చేసుకొని, అక్కడే కాపురం పెట్టేసారట. ఈ విషయాన్ని ఒక వార్తాపత్రిక ప్రచురించడంతో ఈ విషయం తెలుసుకున్న సైరా భాను సంక్షోభంలో మునిగిపోయింది. ఇంతకాలం తనను ప్రేమించిన భర్త ఇంత ఈజీగా ఎలా మోసం చేయగలిగాడు అని నమ్మలేకపోయింది. ఇక క్రమంగా నిజాలు బయటపడే కొద్ది తప్పనిసరిగా ఆ బాధను స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దిలీప్ కుమార్ చేసిన పనికి సైరా భాను తట్టుకోలేక.. ఆ బాధను మరిచిపోయే ప్రయత్నం చేసిన దాని నుంచి కొంతకాలం బయటపడలేకపోయినట్లు సమాచారం .
ఏదేమైనా బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తనకు తోడుగా ఉంటానని నమ్మించి, ఆమె వివాహం చేసుకొని 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమెను కాదని ఇంకో అమ్మాయిని తన జీవితంలోకి తీసుకురావడంపై నెటిజన్స్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
తప్పు ఒప్పుకున్న దిలీప్ కుమార్..
ఒక దిలీప్ కుమార్ తన ఆటో బయోగ్రఫీ “ది సబ్జెన్స్ అండ్ ది షాడో” లో ఆస్మా రెహ్మాన్ తో పరిచయం , పెళ్లి గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడి, అనుకోని కొన్ని సంఘటనలు మమ్మల్ని దగ్గర చేశాయి. నా తప్పును బహిరంగంగా అంగీకరించి, తిరిగి బంధాన్ని కొనసాగించేందుకు కొంచెం సమయం ఇవ్వాలని సైరాను కోరాను” అంటూ ఆయన మెన్షన్ చేశారు. ఇక తర్వాత ఆస్మాతో 1981లో పెళ్లికాగా 1983 లోనే విడాకులు ఇచ్చి మళ్లీ సైరా బాను తోనే జీవితం కొనసాగించారు దిలీప్ కుమార్. ఇక దిలీప్ కుమార్ 99 సంవత్సరాలు వయసులో 2021 జూలై 7వ తేదీన తుది శ్వాస విడిచారు.