Brahmamudi serial today Episode: కావ్య ఏడుస్తూ.. అందరినీ తిడుతుంది. షర్ట్ దొరికిందంటే ఆయన ఉన్నట్టే కదా అంటుంది. ఆయన దారి తప్పి పోయాడేమో.. ఆయనకు దాహం వేస్తుందేమో.. ఆకలి వేస్తుందేమో.. అప్పు మనం వెళ్దాం పదే వెళ్లి వెతుకుదాం అంటుంది. అందరూ ఇప్పుడు వద్దు కావ్య ఆగు అని చెప్తుంటే.. మీరు వచ్చినా రాకున్నా నేను వెళ్లి వెతుకుతాను అంటూ కావ్య వెళ్లబోతుంటే.. అందరూ పట్టుకుంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి హలో ఏంటిది… మిగతా పేషెంట్స్‌కు డిస్టర్బ్ గా ఉంది. మీకు గాయాలకు ట్రీట్‌మెంట్ చేశాం కదా..? డిస్‌చార్జ్ చేస్తాం వెళ్లిపోండి అని చెప్తాడు. దీంతో కావ్య త్వరగా చేయండి డాక్టర్. ఇక్కడే ఉంటే నేను మా ఆయనను వెతకలేను అంటుంది. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి చెప్తాము అని డాక్టర్ వెళ్లిపోతాడు.
కావ్య ఏడుస్తూ.. నేను వెళ్లి వెతుకుతాను. ఆయన దొరుకుతారు. ఆయన ఎక్కడికి పోరు.. ఆయన ఉంటారు అని చెప్తుంది. కనకం కూడా ఏడుస్తూనే అమ్మా కావ్య అల్లుడు గారు క్షేమంగా ఉంటే నీకోసం వస్తారు తల్లి.. అయన వచ్చే వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి అని ఓదారుస్తుంది. తర్వాత యామిని వాళ్లు రాజ్‌ను తీసుకుని ఇంటికి వెళ్తుంటారు. ఇంకోవైపు కావ్యను తీసుకుని అపర్ణ వాళ్లు వెళ్తుంటారు. రాజ్‌ను లిఫ్ట్‌లోంచి యామిని కిందకు తీసుకెళ్తే అదే లిఫ్ట్ ముందు నుంచి స్టెప్స్ ద్వారా కిందకు వెళ్తారు కావ్య వాళ్లు.
రాజ్‌ను తన ఇంటికి తీసుకెళ్లిన యామిని బావ ఇదే మన ఇల్లు అని చెప్తుంది. ఇంట్లో రాజ్, యామిని కలిసి ఉన్న ఫోటోలు ఉంటాయి. అవన్నీ రాజ్ చూస్తుంటాడు. చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగిన ఇల్లు. ఇక్కడే ఇద్దరం కలిసి ఆడుకున్నాం. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇద్దరం కలిసి బతకాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది బావ. చూశావా బావ మనకు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. నీకు ఏవీ గుర్తు రావడం లేదా..? అని అడుగుతుంది. గుర్తు రావడం లేదని రాజ్ తలూపితే.. సరే ఉండు బావ నీ రూం రెడీ చేసి వస్తాను అని లోపలికి వెళ్తుంది. వైదేహి కూడా చిన్నప్పటి నుంచి యామిని నువ్వే కాబోయే భర్తవు అని ఎన్నో కలలు కంది బాబు. దాని ఇష్ట ప్రకారమే అన్ని జరిపించాం. నిశ్చితార్థం కూడా జరిపించాం. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఇలా జరిగింది బాబు. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే కళ్లారా చూడాలని ఎంతో ఆశపడ్డాం. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది బాబు ఏమైనా గుర్తుకు వస్తుందా..? బాబు అని అడగ్గానే.. రాజ్ తల పట్టుకుని బాధపడుతుంటే.. యామిని వచ్చి అయ్యో బావా.. ఇప్పుడే కదమ్మా బావ వచ్చాడు. రాగానే పాతవి అన్ని గుర్తు చేయాలా..? బావా రా రూం రెడీ చేశాను అంటూ రాజ్‌ను రూంలోకి తీసుకెళ్తుంది.
ఇంటికి వచ్చిన కావ్యను చూసి స్వప్న ఏడుస్తుంది. అందరూ డల్లుగా ఇంటికి వస్తారు. ఇంట్లో గోడకు ఉన్న రాజ్ ఫోటో చూసి కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇందిరాదేవి కావ్యను ఓదారుస్తుంది. ఒక్కోసారి ఆ దేవుడు మనుషులతో ఎందుకు ఇంత కఠినంగా ఉంటాడో తెలియడం లేదు కావ్య. జీవితాన్ని ఒక అందమైన కలలా చూపిస్తూనే మరుక్షణం అది కేవలం ఒక నీటి బుడగలాంటిది అంటూ మాయం చేస్తుంటాడు. మీ తాతయ్య గారు హాస్పిటల్‌లో ఉన్నారంటే నేను తట్టుకోలేకపోయాను. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత భారం మోయాల్సి వస్తుందని అనుకోలేదమ్మా.. కోట్ల ఆస్థి ఉన్నా నీ బాధను దూరం చేయలేని నిరుపేదలుగా నిలబడ్డాము అని చెప్తుంది. దీంతో కావ్య అమ్మమ్మ ఇప్పుడు నాకు ఏమైందని మీరంతా బాధపడుతున్నారు. ఆయన ఎక్కడున్నారని తెలియక బాధపడుతున్నాను. అయినా లోయలో పడిపోయి ఏమైనా గాయలు అయుంటాయని నేను కంగారు పడుతున్నాను. అంతే తప్పా నేను చాలా ధైర్యంగా ఉన్నాను అమ్మమ్మ అని చెప్తుంది.
అపర్ణ దగ్గరకు వెళ్లి అత్తయ్యా హాస్పిటల్ లో జరిగిన విషయాలు అన్ని చూసి అవే నిజమని నమ్మి మీరిలా బాధపడకండి. నేను చెప్తున్నాను కదా ఆయన ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నారని నా మనసు చెప్తుంది. ఎక్కడున్నా సరే ఆయన తిరిగి ఇంటికి వస్తారు. ఆ నమ్మకంతోనే మీరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పగానే.. అప్పు.. ఏడుస్తూ.. అక్కా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి నేను చెప్పేది విను అంటుంది. దీంతో కావ్య, అప్పు ఒక పోలీస్‌గా నువ్వు సాక్ష్యాలు చూసి మాట్లాడుతున్నావు. కానీ నా మనసు చెప్తుంది. ఆయన క్షేమంగానే ఉంటారు. తప్పకుండా ఆయన తిరిగి వస్తారు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో.. ఆయన వచ్చిన రోజే మీకు అర్థం అవుతుంది అని చెప్పి పైకి వెళ్లిపోతుంది. ఇంతలో రుద్రాణి రాజ్ చనిపోయాడు. కావ్యను ఇలాగే వదిలేస్తే పిచ్చిదై పోతుంది అని చెప్పగానే.. ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని కొడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?