BigTV English

Actor Jeetendra :ఓ మై గాడ్.. ఆ కొంత స్థలాన్ని రూ.855 కోట్లకు అమ్మేసిన సీనియర్ నటుడు జితేంద్ర

Actor Jeetendra :ఓ మై గాడ్.. ఆ కొంత స్థలాన్ని రూ.855 కోట్లకు అమ్మేసిన సీనియర్ నటుడు జితేంద్ర

Actor Jeetendra : బాలీవుడ్ లో కొనసాగే ఎంతోమంది సెలబ్రిటీలు సినిమాలలో సంపాదించింది మొత్తం ఇంటి పైన భూములు పైన పెట్టుబడి పెడుతూ వారి ఆస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ముంబైలో ఇంటిని కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలా భారీ ధరలకు కొనుగోలు చేయడం తిరిగి వాటిని అధిక లాభాలతో అమ్మడం వంటివి చేస్తుంటారు. తాజాగా నటుడు జితేందర్ (Jeetender)సైతం వందల కోట్ల విలువచేసే ఆస్తులను అమ్మారని తెలుస్తుంది. మరి జితేందర్ అమ్మేసిన ఆస్తులు ఏంటి? వాటి విలువ ఎంత? ఈ ఆస్తులను ఎవరు కొనుగోలు చేశారనే విషయానికి వస్తే…


అంధేరీ ప్రాంతం…

బాలీవుడ్ నటుడు జితేందర్ మరియు అతని కుటుంబ సభ్యులు ముంబైలోని సెలబ్రిటీలో నివసించే అంధేరి ప్రాంతంలో విలువైన భూములను కలిగి ఉన్నారు.ఈ భూమిని ₹ 855 కోట్లకు NTT గ్లోబల్ డేటా సెంటర్లకు అమ్మినట్టు తెలుస్తోంది. ఈ విలువైన ఆస్తులను రెండు కుటుంబ యాజమాన్యంలోని సంస్థలు, పాంథియోన్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్ , తుషార్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విక్రయించారు. దీనికి సంబంధించి మే 29, 2025న ఒప్పందం కుదుర్చుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది. జితేందర్ కుటుంబం విక్రయించిన ఈ భూమి 9,664.68 చదరపు మీటర్లు అంటే సుమారుగా 2.39 ఎకరాలు ఉన్నట్టు తెలుస్తోంది.


రూ.855 కోట్ల రూపాయలు…

 

ప్రస్తుతం ఈ ప్రాంతంలో బాలాజీ ఐటీ పార్క్ఉంది. ఇది మొత్తం 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఎత్తయిన భవనాలు ఉన్నట్టు ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెలియజేస్తున్నాయి. ఎంతో ఖరీదైన ఈ ప్రాంతంలో ఈ స్థలాన్ని గతంలో నెట్‌మ్యాజిక్ ఐటీ సర్వీసెస్‌గా పిలువబడే NTT గ్లోబల్ డేటా సెంటర్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కొనుగోలు చేశారు. ఈ కంపెనీ క్లౌడ్ సొల్యూషన్స్, హోస్టింగ్, డేటా మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి అనేక రకాల సాంకేతిక సేవలను అందిస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ లావాదేవీలకు సంబంధించి ₹ 8.69 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు ₹ 30,000 రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా చెల్లించినట్టు సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది కాస్త సంచలనంగా మారింది. కేవలం 9,664.68 చదరపు మీటర్లు ఉన్న ఈ స్థలం ఏకంగా 855 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అయితే ముంబైలోనే అంధేరి ప్రాంతం చాలా ఖరీదైన ప్రాంతమని చెప్పాలి .ఇక్కడ పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు. ఇక ఈ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలన్న భారీ స్థాయిలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జితేందర్ సైతం తన ఆస్తులను వందల కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×