BigTV English

G V Prakash – Saindhavi Divorce: సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట విడాకులు.. 11 ఏళ్ల బంధానికి గుడ్ బై!

G V Prakash – Saindhavi Divorce: సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట విడాకులు.. 11 ఏళ్ల బంధానికి గుడ్ బై!

G V Prakash Kumar Divorce with His Wife Saindhavi: ప్రేమ, పెళ్లి, విడాకులు. ఈ వ్యవహారం ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో జరుగుతుంది. సినిమా చేసే టైంలో స్నేహితులుగా పరిచయం అవటం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటం.. ఇక ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లటం. ఇదంతా ఒకే కానీ.. పెళ్లికి ముందు వరకు ఒకరినొకరు ఎంతో ఇష్టంగా, ఎంతో ఆప్యాయంగా.. అన్యోయంగా ఉంటూ వారి వారి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు.


కానీ పెళ్లి చేసుకున్నాక.. వారిలో మార్పులు కనిపిస్తాయి. ఒకరిపై ఒకరు ధ్వేషించుకుంటారు. చివరికి అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకుంటారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో జరుగుతున్నది ఇదే!. ఇప్పటికే ఎంతో మంది నటీ నటులు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని.. విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే బాటలోకి మరొక సినీ ప్రేమ జంట వచ్చి చేరింది.

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ తన భార్య, సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో జీవీ ప్రకాష్, సైంధవి ఒకే పోస్ట్ పెట్టారు. ఈ మేరకు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. కాగా జీవీ ప్రకాష్.. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సైంధవిని 2013లో ప్రేమించి పెళ్లి చసుకున్నాడు. ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది.


Also Read: దీపికాతో రణవీర్ సింగ్ విడాకులు.. రణవీర్ ఏమన్నాడంటే.. ?

జీవీ ప్రకాష్ సోషల్ మీడియా ద్వారా ఇలా పంచుకున్నాడు.. ‘‘ చాలా ఆలోచించిన తర్వాత సైంధవి, నేను 11 ఏళ్ల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాము. వివాహం, మన మానసిక ప్రశాంతత కోసం, మా ఇద్దరి లైఫ్‌లు మెరుగవటం కోసమే పరస్పర గౌరవంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.

అందువల్ల ఇలాంటి సమయంలో మీడియా మిత్రులు, అభిమానులను దయతో అడుగుతున్నాము..
మా నిర్ణయాన్ని అర్థం చేసుకొని గౌరవించాలని కోరుతున్నాము. మేము విడిపోతున్నాము. ఇది కరెక్ట్ నిర్ణయమే అని మేము నమ్ముతున్నాము. ఇది ఒకరికొకరు ఉత్తమ నిర్ణయం. మీ అవగాహన, ఈ కష్ట సమయంలో మద్దతు చాలా అవసరం’’అంటూ జీవీ ప్రకాష్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అయితే అదే పోస్టును సింగర్ సైంధవి కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

Also Read: GV Prakash Kumar: మా విడాకులకు కారణం మీకు తెలుసా.. పరువు పోగొట్టుకోకండి

ఇక జీవీ ప్రకాష్ సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు తన మ్యూజిక్ అందించి అదరగొట్టాడు జీవీ ప్రకాష్. యుగానికి ఒక్కడు, రాజా రాణి, సురరై పోట్రు, అసురన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించి దుమ్ము దులిపేశాడు. అంతేకాకుండా తెలుగులో కూడా పలు సినిమాలకు సంగీతం అందించి తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు. ఇక సంగీత దర్శకుడిగానే కాకుండా.. సినిమా హీరోగా కూడా చేసి అదరగొట్టేశాడు.

Tags

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×