Sanjay Dutt : ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా బిజీగా ఉన్న స్టార్స్ లో ఒకరు. ‘కేజీఎఫ్ 2’ (KGF 2) తరువాత సంజయ్ దత్ మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారాడు ఈ హీరో. తాజాగా సంజూ బాగా ఓ మెగా హీరో సినిమాలో నటించబోతున్నాడు అన్న వార్తలు విన్పిస్తున్నాయి. మరి ఈ హీరో ఏ మెగా హీరో సినిమాలో ఛాన్స్ పట్టేశాడు? అనే వివరాల్లోకి వెళ్తే…
మెగా హీరో సినిమాలో బడా విలన్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yetigattu) అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ సెలెక్ట్ అయ్యారనే ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్ర దర్శకుడు రోహిత్ సల్మాన్ కు స్క్రిప్ట్ చెప్పగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించడానికి ఆయన భారీ పారితోషికం డిమాండ్ చేయగా, నిర్మాతలు ఓకే చెప్పారని అంటున్నారు. చివరకు సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడానికి సైన్ చేశాడని, త్వరలోనే ఆయన ‘సంబరాల ఏటి గట్టు’ సెట్స్‌లో జాయిన్ అవుతారని భావిస్తున్నారు.
‘సంబరాల ఏటి గట్టు’ సినిమా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఐశ్వర్య లక్ష్మి ఇందులో సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించగా, కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో సాయి తేజ్ పాత్రను గతంలో ఎన్నడూ లేని విధంగా తెరకెక్కిస్తున్నారు నూతన దర్శకుడు రోహిత్ కెపి.
‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెట్రివేల్ పళనిసామి సినిమాటోగ్రాఫర్ కాగా, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ‘హనుమాన్’ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సంబరాల ఏటి గట్టు’ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
సంజయ్ దత్ లైనప్
సంజయ్ దత్ చివరిసారిగా రామ్ హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో విలన్ గా నటించాడు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. బాలకృష్ణ హీరోగా చేస్తున్న ‘అఖండ 2’ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడనే రూమర్లు ఉన్నాయి. వీటిపై ఇంకా క్లారిటీ రానే లేదు. అంతలోనే ఇప్పుడు సంజయ్ దత్ ‘సంబరాల ఏటి గట్టు’ మూవీలో భాగం కాబోతున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.