BigTV English

Shahrukh khan: స్టార్ హీరోకి అస్వస్తత.. చికిత్స కోసం విదేశాలకు పయనం

Shahrukh khan: స్టార్ హీరోకి అస్వస్తత.. చికిత్స కోసం విదేశాలకు పయనం

Bollywood Actor Shahrukh khan heads to the US for Emergency Eye Treatment: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అభిమానులను కలవరపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. షారుఖ్ ఖాన్ కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు క్రితమే లండన్ నుండి ఇండియా వచ్చిన షారుఖ్.. చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.


2014లో ముంబైలో ఆయన కంటి ఆపరేషన్ చేపించుకున్నారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఆ సమస్య తిరగబెట్టడంతో ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లనున్నారు. ఇటీవల చికిత్స కోసం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన షారుఖాన్.. అక్కడ ట్రీటమెంట్ లోపం కారణంగా సమస్య మరింత పెద్దది కావడంతో మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నేడు అంటే (జులై 30) న సూపర్ స్టార్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

షారుఖాన్‌తో పాటు ఆయన భార్య గౌరీఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. మరో కొద్ది రోజుల్లో షారుఖాన్‌కు కంటికి సంబంధించిన చికిత్స జరగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ లు జరిగిన నేపథ్యంలో.. అదే టైమ్ లో షారుఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే..


Also Read: ఫస్ట్ స్ట్రైక్‌ ఓ రేంజ్‌లో ఉంది.. మరి ఇదెలా ఉంటుందో..!

ఇక కెరీర్ పరంగా చూస్తే.. షారుఖ్ ఖాన్ మరో కొత్త ప్రాజెక్ట్ తో మనముందుకు రానున్నాడు. కుమార్తె సుహానాతో కలిసి కింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. షారుఖ్ ఖాన్ గతేడాది క్రస్మస్‌కి మూవీ రిలీజ్ అయిన డంకీ మూవీలో కనిపించాడు. ఈ సినిమాలో షారుక్‌కి జోడీగా తాప్సీ పన్ను నటించింది.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×