BigTV English

Viswam – Gopichand: ఫస్ట్ స్ట్రైక్‌ ఓ రేంజ్‌లో ఉంది.. మరి ఇదెలా ఉంటుందో..!

Viswam – Gopichand: ఫస్ట్ స్ట్రైక్‌ ఓ రేంజ్‌లో ఉంది.. మరి ఇదెలా ఉంటుందో..!

Viswam – Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు తీస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా గోపీచంద్‌ సినీ కెరీర్‌కి కంబ్యాక్ ఇవ్వలేదు. గతేడాది రామాబాణం అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. కానీ అనుకున్నంత హిట్ కాలేకపోయింది. రొటీన్ స్టోరీ, రొటీన్ పాత్రలతో తెరకెక్కడంతో సినీ ప్రియులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ‘భీమా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అయితే గోపీచంద్ సినీ కెరీర్‌లో ఏ చిత్రానికి లేని హైప్ క్రియేట్ అయింది.


అయితే ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడింది. మాస్ యాక్షన్ హైలైట్‌గా ఉన్నా.. సరైన కథ లేకపోవడంతో సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. ఇక ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గోపీచంద్‌కు నిరాశే మిగిలింది. అయితే ఈ సారి అలాంటి తప్పు చేయకుండా గోపీచంద్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే ‘విశ్వం’. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి టాలీవుడ్ అగ్ర బ్యానర్ అయిన పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్నాడు.

Also Read: గోపీచంద్- శ్రీను వైట్ల సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది!


ఈ మూవీలో గోపీచంద్ సరసన యంగ్ హీరోయిన్ కావ్యా థాపర్ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఒకత్తయితే గతంలో రిలీజ్ అయిన ట్రైటిల్ ట్రాక్ మరొక ఎత్తనే చెప్పాలి. ఈ టైటిల్ ట్రాక్‌తో సాగే ఫస్ట్ స్ట్రైక్‌లో గోపీచంద్ మాస్ లుక్‌లో కనిపించి సినిమాపై అంచనాలు పెంచేశాడు. అతడి నయా లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. అలాగే అతడు చెప్పే ఓ డైలాగ్‌ కూడా మరింత బజ్ క్రియేట్ చేసింది. గింజ గింజపై తినేవాడి పేరు ఉంటుంది.. అదే దీనిపై నా పేరు ఉంటుంది అంటూ చెప్పిన ఓ డైలాగ్ ఫుల్ హైప్ క్రియేట్ చేసింది.

దీనిబట్టి చూస్తే ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మేకర్స్ ఇప్పుడు మరో అప్డేట్‌తో సర్‌ప్రైజ్ అందించారు. ఇప్పుడు ‘ద జర్నీ ఆఫ్ విశ్వం’ పేరుతో మరో అప్డేట్‌ను అందించారు. ఈ అప్డేట్‌ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని రేపు అనగా జూలై 31న ఉదయం 11.07 గంటలకు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సినిమాకి గోపీమోహన్‌ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నాడు. అలాగే చేతన్ భరద్వాజ్‌ మ్యూజిక్ సమకూరుస్తూ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×