BigTV English

Bollywood Heroes : గుట్కా తిని నోరు పాడు చేసుకున్న సెలబ్రిటీస్… ఛీ.. ఛీ… వీడియో చూశారా..?

Bollywood Heroes : గుట్కా తిని నోరు పాడు చేసుకున్న సెలబ్రిటీస్… ఛీ.. ఛీ… వీడియో చూశారా..?

Bollywood Heroes : సాధారణంగా కొన్ని కొన్ని ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సరే సెలబ్రిటీలు డబ్బుకి కక్కుర్తి పడి వాటికి ప్రమోటర్స్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఫలితంగా అభిమానుల నుంచి కూడా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయకమానదు. దీనికి తోడు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పాన్ మసాలా, గుట్కా, బీడీ, బీర్, సిగరెట్, ఆల్కహాల్ వంటి ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ (Shahrukh Khan) మొదలుకొని అజయ్ దేవగన్(Ajay Devgan), సల్మాన్ ఖాన్ (Salman Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి బడా బాలీవుడ్ స్టార్స్ ఈ పాన్ మసాలా ప్రకటనలో పాల్గొనడంపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కూడా వెళ్లవెత్తుతున్నాయి.


గుట్కా తిన్న సెలబ్రిటీస్.. ఛీ ఛీ..ఇలా వున్నారేంటి..?

ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రకటనలు పాల్గొన్న నటీనటులు నిజంగా పాన్ మసాలా తింటూ సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించేలా ఒక ఏఐ ఆధారిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. వాస్తవానికి పాన్ మసాలా ప్రకటనలో నటించే సెలబ్రిటీలు ఎవరూ కూడా ఈ ఉత్పత్తులను ఉపయోగించరు. కేవలం ఆ బ్రాండ్ కి ప్రమోషన్ చేయడానికి మాత్రమే వాళ్ళు నటిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం పాన్ మసాలా తింటే ఆ సెలబ్రిటీలు ఎలా ఉంటారనేది మనం స్పష్టంగా చూడవచ్చు. వారి దంతాలు పూర్తి నల్లగా మారిపోయి, చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తున్నారు.


వైరల్ గా మారిన వీడియో..

ఏఐ ఆధారితంగా విడుదల చేసిన ఆ వీడియోలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ , క్రిస్ గేల్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తోపాటు పలువురు ప్రముఖుల కూడా ఉన్నారు. ఈ వీడియోని పూర్తీ హాస్యాస్పదంగా రూపొందించినప్పటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఈ ప్రకటనల వాస్తవాలపై జనాలకు అవగాహన కల్పించేందుకు మాత్రమే చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పాన్ మసాలా ప్రకటనలలో ప్రముఖులు పాల్గొనడం యువతపై చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ప్రకటనలో ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల ప్రజల ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. మరోవైపు కొంతమంది ప్రముఖులు కూడా తమ నైతిక విలువలను, బాధ్యతలను గుర్తించి ఈ ప్రకటనలను తిరస్కరించిన వారు కూడా ఉన్నారు. వారిలో అనిల్ కపూర్(Anil Kapoor), కార్తీక్ ఆర్యన్(Karthik Aryan), అల్లు అర్జున్ (Allu Arjun), యశ్వంత్ (Yashwanth) వంటి నటులు ఈ పాన్ మసాలా ప్రమోషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అలా మొత్తానికి అయితే ఏఐ ఆధారిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఈ స్టార్స్ అందరూ ఒక నిర్ణయానికి వస్తారా? ఇకనైనా ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉంటారా? అన్నది చూడాలి.

also read:Hero Vishal: పెళ్లికి సిద్ధమైన హీరో విశాల్.. ఈసారి వధువు మరో హీరోయిన్..?

 

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×