Hero Vishal: ఈమధ్య కాలంలో ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు సినిమాలలో బిజీగా మారుతున్నారు. కానీ పెళ్లీడు దాటిపోయినా.. వివాహం అనే మాట ఎత్తడం లేదు. ఈ క్రమంలోనే పలువురు హీరోలు, హీరోయిన్లు ఎవరితోనైనా కాస్త చనువుగా ఉంటే చాలు వారిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ నటుడు విశాల్ (Vishal) పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈసారి వేరే హీరోయిన్తో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఈ వార్తలైనా నిజం అవుతాయా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
గుర్తుపట్టలేనంతగా మారిన హీరో విశాల్..
అసలు విషయంలోకి వెళ్తే.. తమిళ నటుడు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితమే. ‘పందెంకోడి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన ప్రతి సినిమాని కూడా తెలుగులో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే 12 ఏళ్ల క్రితం పూర్తి చేసిన ‘మదగజరాజా’ అనే కామెడీ సినిమాను విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా విశాల్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయి, చాలా వీక్ గా కనిపించారు. దీనికి తోడు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ సమయంలో విశాల్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించగా.. మళ్లీ ఆ కార్యక్రమానికి వెళ్లి సక్సెస్ చేశారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్లే.. ఎండవేడి, ఉక్కపోత కారణంగా నీరసమయి అలా కుప్పకూలారని విశాల్ మేనేజర్ తెలిపారు.
త్వరలో నా పెళ్లి అంటూ విశాల్ క్లారిటీ.. తెరపైకి మరో హీరోయిన్
ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆయన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇక దీంతో తాజాగా ఆ పెళ్లి వార్తలపై కూడా స్పందించారు విశాల్. విశాల్ మదురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చారు. విశాల్ మాట్లాడుతూ..”చెంగల్ పట్టు జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ పెళ్లి కోసం మధురై వచ్చాను. మీనాక్షి అమ్మవారిని దర్శించుకోకుండా ఎలా వెళ్ళగలను. అమ్మ ఇచ్చిన పట్టుచీరను అమ్మవారికి సమర్పించి, దర్శనం చేసుకున్నాను. ఇక నటుల సంఘం భవనం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను. భవనం త్వరలో ప్రారంభం కాబోతుండడంతో నా పెళ్లి వాయిదా పడింది. భవనం పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చారు విశాల్. ఇకపోతే పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మరో రెండు నెలల్లో నటుల సంఘం భవనం నిర్మాణం పూర్తయి.. సెప్టెంబర్ లో పెళ్లి జరుగుతుందని విశాల్ తెలిపారు. మరి ఇప్పుడు విశాల్ పెళ్లి చేసుకుంటానని వార్తలు రాగా తాజాగా ఇప్పుడు ఒక ట్విట్టర్ పోస్టు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రముఖ హీరోయిన్ శ్రీ ధన్సిక (Sri Dhansika) తో విశాల్ ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యాడని, త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని ఆ పోస్ట్ సారాంశం. మరి దీనిపై విశాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ALSO READ:Bellamkonda Sreenivas : డైరెక్టర్ వివి వినాయక్ మోసం చేశాడు… అందుకే ఛత్రపతి హిందీ డిజాస్టర్
Vishal – Sai Dhansika Marriage💥👩❤️👨
Announcement 🔜 pic.twitter.com/bFbCjLhtkW
— Christopher Kanagaraj (@Chrissuccess) May 19, 2025